వైరల్ వీడియో : వెరైటీగా గోల్ చేద్దాం అనుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..?
అయితే సాధారణంగా ఫుట్బాల్ ఆటలో ప్రతి ఒక ఆటగాడు ఎంతో వినూత్నంగా గోల్డ్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎవరైనా ఆటగాడు ఇలా వినూత్నంగా గోల్ చేశాడు అంటే ఆట వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్య పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా కొత్తగా ట్రై చేస్తే చివరికి చెత్తగా మారి పరువు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక్కడ ఓ ఆటగాడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెరైటీగా గోల్ చేద్దాం అనుకున్నాడు కానీ చివరికి ఇంకేదో జరిగిపోయింది.
పెనాల్టీ గోల్ వచ్చిన సమయంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నాడు ఈ క్రమంలోనే ఎంతో కొత్తగా గోల్ చేయాలి అని అనుకున్నాడు దీనికోసం చిత్రమైన రన్ అప్ తో గోల్ పేపర్ ను కన్ఫ్యూజ్ చేయాలి అనుకున్నాడు.. కానీ చివరికి గోల్ చేయకపోవడంతో నిరాశే ఎదురయింది అతనికి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఇది అర్జెంటీనాలో చోటు చేసుకుంది. ఇక ఈ వీడియో చూసిన అందరూ కూడా ఆటగాడి పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరినో ఇమిటేట్ చేయాలి అనుకుని చివరికి పరువు తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.