వామ్మో.. స్మృతి మందాన ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?
ప్రస్తుతం మార్కెట్లో ఎంతో పేరు ఉన్న బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంటున్న స్మృతి మందాన ఆమె ఆదాయాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. ఇక ఇటీవల నైకి ఒప్పందంతో స్మృతి మందాన మరింత ఆదాయాన్ని సంపాదించనుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్ కు ప్రచారం ఇవ్వాలన్న కూడా 50 లక్షల వరకు తీసుకుంటుంది అనే టాక్ ఉంది. అయితే ఈ మహిళ క్రికెట్ ప్లేయర్ ఆస్తుల విలువ 22 కోట్ల వరకు ఉంటుందని ఇటీవల ఓ సంస్థ కూడా వెల్లడించింది.
అయితే ఒక మహిళా క్రీడాకారిణిగా ఆమెకు వచ్చే జీతం తో పాటు భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో బిసిసిఐ నుంచి ప్రతి ఏడాది 50 లక్షల రూపాయలు అందుతాయి. ఆ తర్వాత మిగతా లీగ్ లలో కూడా మరింత ఆదాయాన్ని సంపాదిస్తుంది స్మృతి మందాన. ఇక స్మృతి మందాన పేరుపై మహారాష్ట్రలో పలు రకాల కేఫ్ లు కూడా ఉన్నాయి. అయితే స్మృతి మందాన ఎంతగానో ఫేమస్ కావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మైదానంలో దూకుడుగా ఆడే స్వభావం మరొకటి సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్. ఇలా అన్ని విషయాల్లో కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది స్మృతి మందాన .