రోహిత్ శర్మ లో కంగారు పుట్టిస్తున్న కరోనా.. ఎందుకో తెలుసా..?

praveen
ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు అనే చెప్పాలి. ఇక ఓవైపు సారథిగా జట్టును ఎంతో సమతూకంగా ముందుకు తీసుకెళ్తునే  మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా ముంబై ఇండియన్స్ జట్టును గెలిపించాడు రోహిత్ శర్మ. అయితే ఐపీఎల్లో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే గాయం బారిన పడిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టులో స్థానం దక్కించుకున్న లేదు. ఇక బీసీసీఐ పై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ రోహిత్ శర్మను  టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇటీవల రోహిత్ శర్మ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించిన ఆస్ట్రేలియా బయలుదేరాడు.



 ఆస్ట్రేలియా టూర్ కి ఆలస్యంగా వెళ్లిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం సిడ్నీలోని డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో క్వారంటైన్ లో గడుపుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి సిడ్నీ లో కరోనా  వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉంది అన్న విషయం తెలుస్తుంది. అక్కడి అధికారులు ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ కరోనా  వైరస్ కంట్రోల్ కావడం లేదు. ఈ క్రమంలోనే సిడ్నీ సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. రోహిత్ శర్మ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ లో ఉండగా ఒక అపార్ట్మెంట్ నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి కూడా లేకపోయింది.



 కాగా సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగే సమయానికి 14 రోజులకు క్వారంటైన్ పూర్తిచేసుకుని రోహిత్ శర్మ టీమిండియా జట్టులో కలవాల్సి ఉంది.  ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ తో  సిడ్ని  ప్రజలతోపాటు రోహిత్ శర్మ లో కూడా కంగారును పెంచుతున్నాయి ఎందుకంటే.. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్ ఆస్ట్రేలియా జట్లు మూడవ టెస్ట్ ఆడనున్నాయి. అయితే అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్ చేసే అవకాశం లేకపోయింది.  2020 తర్వాత నేరుగా మూడో టెస్టులో హిట్మ్యాన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: