ఓపెనర్ గా కె.ఎల్.రాహుల్ వద్దు.. అతన్ని పంపండి.. మాజీ కోచ్ షాకింగ్ కామెంట్స్..
వన్ డే మ్యాచ్ లలో మిడిలార్డర్లో ఆడి అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్ ని ఓపెనర్గా పంపడంతో... టీం ఇండియా మిడిలార్డర్ కాస్త ఎంతో బలహీనంగా మారిపోయిందని.. అందుకే మొదటి టి20 మ్యాచ్ లో లాగా కాకుండా తర్వాత రెండు టి20 లలో కె.ఎల్.రాహుల్ ను 5వ స్థానంలో ఆడించాలని మాజీ కోచ్ సంజయ్ సూచించాడు. ఇక ఓపెనర్గా రోహిత్ శర్మ జట్టులో లేక పోవడంతో అతని స్థానంలో మయాంక్ అగర్వాల్ ను పంపితే ఎంతో బెటర్ అంటూ సూచించాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్గా మాత్రమే కాకుండా 5వ స్థానంలో కూడా గొప్పగా రాణిస్తున్నారని... అందుకే ఓపెనర్గా కేఎల్ రాహుల్ కి బదులుగా మయాంక్ అగర్వాల్ పంపిస్తేటీమిండియా మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటూ బంగర్ సూచించాడు.
కాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే సిరీస్లో ఓపెనర్గా ఆడిన మయాంక్ అగర్వాల్ ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్ కూడా నిలకడలేని తో ఇబ్బంది పడుతున్నాడు... ఈ క్రమంలోనే టి20లో కేఎల్ రాహుల్ ని ఓపెనర్గా పంపించిన టీమిండియా మిడిలార్డర్లో మనీష్ పాండే సంజు శాంసన్ లకు అవకాశం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాభారత్ మధ్య రెండవ టీ 20 మ్యాచ్ మధ్యాహ్నం 1:40 గంటలకు ప్రారంభం కానుంది.