అప్పుడేమో ఒక్క సిక్స్ కొట్టలేదు.. ఇప్పుడేమో బాదుడే బాదుడు..?
11 కోట్లకు పైగా పారితోషికం చెల్లించి జట్టు యాజమాన్యం ఆల్ రౌండర్ మాక్స్వెల్ పై నమ్మకం ఉంచి కొనుగోలు చేసింది. అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకున్నాడు మ్యాక్స్వెల్. 11 కోట్లు వెచ్చిస్తే కనీసం టోర్నీ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేక పోయాడు దీంతో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత మాక్స్వెల్ ఆస్ట్రేలియా జట్టులో ఎంపిక య్యాడు దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో మ్యాక్స్ వెల్ ఆడుతున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐపీఎల్ లో ఒక్క సిక్స్ కూడా కొట్టండి మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా జట్టులో మాత్రం సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.
దీంతో ప్రస్తుతం మాక్స్వెల్ ఆటతో అందరూ అవాక్కవుతున్నారు. ఏకంగా రికార్డు స్థాయిలో సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు మాక్స్వెల్. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లో ఒక్క సిక్స్ కూడా కొట్టని ఆటగాడిగా అపఖ్యాతి మూటగట్టుకున్న మాక్స్వెల్ టీమిండియాతో జరిగిన మొదటి వన్డే సిరీస్లో మాత్రం అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మూడు వన్డే సిరీస్లో కలిపి ఏకంగా 11 సిక్సర్లు బాదాడు మ్యాక్స్వెల్. ఇక మాక్స్ వెల్ తర్వాత 6 సిక్సర్లతో హార్దిక్ పాండ్యా స్మిత్ ఉన్నారు. ఏకంగా టోర్నీకి హైలెట్గా నిలిచే విధంగా మాక్స్వెల్ బాదిన సిక్సర్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.