పరుగుల వేటలోనే కాదు.. సంపాదనలో కూడా కోహ్లీ కింగ్.. ఏడాదికి ఎన్ని కోట్లో తెలుసా..?
అంతేకాదు టెస్టుల్లో తొమ్మిది వందల కు పైగా ర్యాంకింగ్ సాధించిన రెండవ భారత ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ అత్యుత్తమ ఆటగాడుగా విరాట్ కోహ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. క్రికెట్ లో నే కాదు సంపాదనలో కూడా విరాట్ కోహ్లీ రా రాజు అనే చెప్పాలి. సంపాదనలో మిగతా ఆటగాళ్లు తో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎంతో ముందుంటాడు. విరాట్ కోహ్లి తో ప్రచారం చేసేందుకు ఎన్నో బ్రాండ్లు కూడా పోటీ పడుతున్నాయి. ఏడాది అత్యధిక మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించిన 100 మంది అథ్లెట్ లలో ఒకే ఒక భారత ఆటగాడు విరాట్ కోహ్లీ పేరు రావడం గమనార్హం.
విరాట్ కోహ్లీ సంపాదన ఏకంగా ఇందులో 193 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 24 మిలియన్ డాలర్ల వరకు వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. మిగతా రెండు మిలియన్ డాలర్లు బీసీసీఐ విరాట్ కోహ్లీకి వేతనం చెల్లిస్తుంది. బీసీసీఐ కాంట్రాక్టులో ఏ ప్లస్ కాంటాక్ట్ లో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టులో అత్యధికంగా 17 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా కొనసాగుతున్నారు. ఇలా రికార్డులు కొల్లగొట్టడం లోనే కాదు ఆదాయం సంపాదించడంలో కూడా కోహ్లీ కింగ్ అనే చెప్పాలి.