ఐపీఎల్ : ఓడించిన ఢిల్లీకి.. థాంక్స్ చెప్పాలేమో.. ఎందుకంటే..?

praveen
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్  కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి సీజన్లో ఎన్నో అంచనాల మధ్య  రంగంలోకి దిగే  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరికి కేవలం లీగ్  దశలోనే వెను  తిరుగుతూ అభిమానులను నిరాశపరుస్తూ ఉండేది. కానీ ఈ సారి మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో బలంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి వరుస  విజయాలు అందుకుంటూ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతూ వస్తోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.

 ఈ క్రమంలోనే పలువురు మాజీలు ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలవటం  పక్క అని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు, ఇక నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగగా ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది.

 ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడినప్పటికీ ప్లేఆఫ్ కి అర్హత సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీనికి కారణం ఈ సీజన్లో మెరుగైన రన్రేట్ ఉండడమే. ఇక ఢిల్లీ గెలిచినప్పటికీ బెంగళూరుకు బెర్త్ ఖాయం అయిపోయింది. అయితే మ్యాచ్ ఓడిపోతామేమో అనేదానికంటే మరో టెన్షన్ బెంగళూరును  నిన్నటి మ్యాచ్ లో ఎక్కువగా వెంటాడింది. 17.3 ఓవర్లలో ఢిల్లీ  ఛేదన  పూర్తిచేసి గెలిస్తే బెంగళూరు రన్రేట్ కోల్కత్తా రన్ రేట్ కంటే తక్కువ అయిపోతుందని భయం బెంగళూరుకు పట్టుకుంది.

 ఇలా అయితే కోల్కతా జట్టు మూడవ స్థానానికి చేరి బెంగళూరు నాలుగవ స్థానానికి చేరేది. కానీ ఢిల్లీ ఆటగాళ్లను చివరివరకు ఆడి  మ్యాచ్ గెలిచినప్పటికీ మెరుగైన రన్రేట్ కారణంగా బెంగళూరు మూడవ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. అందుకే ఢిల్లీ గెలిచినప్పటికీ కూడా... బెంగళూరు జట్టుకు మెరుగైన రన్రేట్ ని మిగిల్చినందుకు కోహ్లీసేన ఢిల్లీ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటున్నారు ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు. కాగా ప్రస్తుతం కోహ్లీ సేన 2016 తర్వాత మొదటిసారి ప్లే ఆప్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: