నోరు విప్పిన సురేష్ రైనా.. అది దారుణం కాదు.. ఘోరం అంటూ..?
ఇటీవలే తమ కుటుంబం లో జరిగిన సంఘటన దారుణం కంటే ఘోరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సురేష్ రైనా. తమ మామయ్య హత్యకు గురయ్యారని... మేనత్త ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి తీవ్ర గాయాలపాలై ఆరోగ్యం క్షీణించి ఒక సోదరుడు కూడా కన్నుమూసాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అత్తయ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు సురేష్ రైనా.
ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనే దానిపై తమకు ఎవరికీ సమాచారం లేదని... కానీ తమ కుటుంబంలో ఘోరం జరిగిపోయింది అంటూ తెలిపారు సురేష్ రైనా. ఇంత దారుణాన్ని ఎవరు చేసారో ఎందుకు చేసారో కూడా అర్థం కావడం లేదని.. పంజాబ్ పోలీసులు త్వరగా దర్యాప్తు జరపాలని కోరుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇంత ఘోరానికి పాల్పడిన నేరస్తులు మరిన్ని దారుణాలకు పాల్పడకముందే వారిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. తన పోస్టుకు పంజాబ్ ముఖ్యమంత్రిని కూడా ట్యాగ్ చేశారు. దీంతో రైనా పై వచ్చిన రూమర్లన్ని పటాపంచలైపోయాయి.