నేడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఈ విషయంపై తెలంగాణ లో పెద్ద ఎత్తున్న మాటల యుద్దం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో అంతర్గత కలహాలు చెలరేగుతున్నయని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి నేడు ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ప్రారంభమైన పోలింగ్. మధ్నహ్నం 3 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. అయితే ఈ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి గట్టి పోటా ప్రకాశ్ చంద్ జైన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పోటీలో ముగ్గురు ఉన్నప్పటికీ వీరిద్దరి మద్యనే టగ్గాఫ్ వార్ ఉందని అంటున్నారు.
HCA అవినీతి పరుల చేతుల్లోకి వెళ్తుందని గత కొంత కాలంగా మాజీ ఎంపీ వివేక్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ పోటీలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీలో ఉన్నారు.