కొండంత సంబరంలో టీమిండియా ఫ్యాన్స్.. ఫైనల్ కు భారత్ ఖాయం..

Chakravarthi Kalyan

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు పడటంతో ఏం జరుగుతుందా అని క్రీడాభిమానులంతా ఆత్రంగా ఎదురు చూశారు. వర్షం ఆగితే మ్యాచ్ ఎలా జరుగుతుందో లెక్కలు వేసుకుంటూ గడిపారు. వర్షం కొద్దిసేపు పడి ఆగితే.. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ టార్గెట్ డిసైడ్ చేసేవారు.


వర్షం ఎక్కడ ఆగుతుందో.. ఎక్కడ డక్ వర్త లూయిస్ పద్దతి అమలు చేస్తారో అని టీమిండియా ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఎదుకంటే.. ఈ పద్దతి ఎప్పుడూ చేధించేవారికి చిరాకే.. ఒకవేళ 46 ఓవర్లకు మ్యాచ్ కుదించి ఉంటే.. టీమిండియా టార్గెట్ 237 పరుగులు చేయాల్సి వచ్చేది.


అదే 20 ఓవర్లకు మ్యాచ్ కుదిస్తే టీమిండియా టార్గెట్ 148 గా ఉంటుంది. అదే జరిగితే.. ఓవర్ కు 7 పరుగులు చేయాల్సి వచ్చేది.. అలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్ మెన్ ఒత్తిడికి గురై మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండేది.


కానీ వర్షం ఆగకపోవడం వల్ల మ్యాచ్ ను అంపైర్లు.. రిజర్వ్ డేకు వాయిదా వేశారు. రిజర్వ్ డే అయిన బుధవారం మ్యాచ్ 46.2ఓవర్ నుంచే కొనసాగిస్తారు. న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్‌ టేలర్‌(67), లేథమ్‌(3) ఉన్నారు. ఒకవేళ రేపు కూడా మ్యాచ్‌ జరిగే అవకాశం లేకపోతే లీగ్‌ దశలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. దీనిని బట్టి, టీమిండియాకే మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో మన జట్టే ఫైనల్‌కు వెళ్తుంది. సో.. వర్షం కొనసాగడం వల్ల అన్నివిధాలా టీమిండియాకే మేలు జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: