చరిత్రకు కేరాఫ్ అడ్రస్ క్రీస్తు..!

KSK
ప్రస్తుతం ప్రపంచం మొత్తం క్రిస్మస్ సంబరాలు తో నిండిపోయి ఉంది. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ లో ప్రపంచంలో జరిగే చారిటీ మరి ఎప్పుడు జరగదని చాలామంది అంటుంటారు. పాశ్చాత్య దేశాలతో పాటు యూరప్ దేశాలలో కూడా ఎక్కువగా క్రీస్తు జన్మదిన వేడుకలను చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో చాలామంది ఒకరికి ఒకరు బహుమతులు పంచుకుంటూ క్రీస్తు ప్రేమను ఇతరులతో తమ వ్యక్తిగత జీవితాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు.


ఈ భూమి మీద ఎప్పుడైతే క్రీస్తు జన్మించాడొ చరిత్ర రెండుగా చీల్చి క్రీస్తుపూర్వం మరియు క్రీస్తు శకం అని తేల్చిపారేశారు చరిత్రకారులు. క్రీస్తు జన్మ నిజమైనదని ఆయన భూమిమీద జన్మించాడు అని అనటానికి చరిత్రకు ఆధారాలు ఉన్నాయని చరిత్ర కూడా రుజువు చేసింది. క్రీస్తు జన్మ బహు వింతైనది మరియు పవిత్రమైనది అని సెలవిస్తోంది బైబిల్.


క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం క్రీస్తు దేవుని కుమారుడని ఆయన పవిత్రమైన కన్య అయినా మరియ కు జన్మించాడని తెలియజేస్తూ ఉంటారు క్రైస్తవులు. సమస్త మానవాళి పాప పరిహారం కోసం క్రీస్తు ఈ భూమి మీద జన్మించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మనిషికి శాంతి సమాధానం తో పాటు దేవుడి రాజ్యమైన పరలోక రాజ్యాన్ని తన జీవితాన్ని ద్వారా అందించారు అని అంటుంటారు క్రైస్తవులు.


కేవలం ఒక తెగ ప్రజలను మాత్రమే కాకుండా ఒక దేశానికే కాకుండా ఆయన సమస్త మానవాళికి పరలోక మార్గాన్ని చూపించడానికి ఈ భూమ్మీద జన్మించి మనిషి అనేక చోట్ల వెతుకుతున్న మోక్షమార్గానికి..హృదయం లో ఉన్న సత్యాన్వేషణకు దారి చూపగల దేవుడు అని అంటుంటారు క్రైస్తవులు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: