హృదయ పవిత్రత శీలానికి ఆధారం!

Durga
ప్రేమ నుండి అహింస ఉద్బవిస్తుంది. అహింస సహస్ర సూర్యుల తేజస్సును మించుతుంది. శాంతి సౌఖ్య ఆనంద కిరణాలను వెదజల్లుతుంది.

మనం పడే కష్టంలో ఎంత పవిత్రత ఉంటే అంత అభివృద్ధి కలుగుతుంది. స్వార్థ త్యాగం, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం లేకపోతే మనకు మోక్షం లేదు. మనమేదైనా గొప్ప కార్యాన్ని శాశ్వతమయిన దానిని సాదించాలంటే నిర్థష్టమయిన క్రమశిక్షణకు లోబడాలి.

భగవానుడు లేని పధార్థమే లేదు. జీవకోటులన్నీ దేవాలయాలే. ప్రతి మానవుని హృదయంలో భగవానుడున్నాడు. కాని ఈ పరమనత్యాన్ని గుర్తించలేదు. కాబట్టి మనకు దేవాలయాలు అవసరం చెడు తలుపుల నుండి విముక్తి పొందడం మోక్షం. చెడు తలపులు పుట్టకుండా ఉండటానికి అవిరళ తపస్సు చేయాలి. మరొక మార్గం లేదు.

వినయం సేవాపరాయుణుని లక్షణం, నిజమైన సదా మానవ సేవలో నిమగ్నమై ఉంటుంది. శాంతిపథమే సత్యపథం. సత్యం శాంతి కంటే ముఖ్యం. హృదయపవిత్రత శీలానికి ఆధారం.
సంఘసేవ మౌనంగా చేసుకోవాలి. కుడిచేయి చేసే సేవ ఎడమ చేతికి తెలియకుండా ఉంటే అదే ఉత్తమమయిన సేవ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: