చెట్లను పెంచితే కష్టాలు రావడం మాత్రం కాయం,,!
గులాబీ మొక్కలు..
చాలామంది ఎంతో ఇష్టంగా గులాబీ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఇంటి గుమ్మం ఎదురుగా గులాబీ మొక్కను అస్సలు పెంచరాదట.ఈ మొక్క రాహువుగ్రహ సమస్యలను ఆహ్వానిస్తుందట.కావున గులాబీ మొక్కలు పెంచుకోవాలి అనుకొనేవారు ఇంటికి వెనుక పెరట్లో కానీ,టెర్రస్ మీద కానీ పెంచుకోవడం ఉత్తమం.
మర్రి చెట్టు..
ఎవరి ఇంట్లోనైనా పొరపాటున మర్రి చెట్టు పెరిగిన తీసివేయాలి.లేదంటే ఇంటి ముందు మర్రిచెట్టు పెరగడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వచ్చి,వారి బంధంలో చీలికలు మొదలవుతాయి.కుటుంబం చిన్నా భిన్నం అవుతుందట.కావున ఇంట్లో ఈ చెట్టు అస్సలు పెంచకండి.
పాలు కారే చెట్లు..
ఇంటి ఆవరణలో లేదా వెలుపల చెట్లు పెంచేటప్పుడు వాస్తు శాస్త్రంతో పాటు జ్యోతిషశాస్త్ర కొన్ని సూత్రాలను తప్పకుండా అనుసరించాలి.శాస్త్రం ప్రకారం ఇంటి ముందు లేదా పెరట్లోనైనా పాలు కారే చెట్టును నాటడం అస్సలు పెంచకూడదట.ఇవి ఇంట్లో అశుభాలకు దారితీస్తాయి.వాటిలో ముఖ్యంగా జిల్లేడు,సపోటా వంటి పాలు కారే చెట్టును ఇంటి ప్రాంగణంలో పెంచరాదు.
హైద్రాంజస్..
ఈ మొక్క మన ఇంట్లో పెంచుకోవడం వల్ల అందాన్ని పెంచడం సంగతేమో కానీ,కుటుంబ సభ్యుల మధ్య అంతరాన్ని మాత్రం బాగా పెంచుతుందట.దీని నుండి వచ్చే వాసనలు నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయట.కావున ఈ చెట్టును ఇంట్లో అస్సలు పెంచుకోకపోవడం మంచిది.
ముళ్ళ మొక్కలు..
కొన్ని మొక్కలకు చాలా ముళ్ళు ఉంటాయి.వాటిని మన ఇండ్లలో పెంచుకోవడం వల్ల,ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ పాకి మనం అనుకున్న పనులు సజావుగా జరగవట.దీనితో ఆర్థిక సమానతలు ఏర్పడి,కుటుంబ అభివృద్ధికి అడ్డుపడతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కావున ఈ మొక్కలను ఇంట్లో పెంచుకోకపోవడమే ఉత్తమం.