ఉప్పుని ఇలా వాడితే..లక్ష్మీదేవిని ఆహ్వానిచ్చినట్టే..!

Divya
ఎంత కష్టపడినా వ్యాపారం వృద్ధి చెందక కొంతమంది, ఉద్యోగం రాక కొంతమంది,ఇంకొంతమంది ఆరోగ్యం సమస్యలతో తెగ ఇబ్బంది పడిపోతుంటారు.అలాంటి వారికి కొన్ని దోషాలు ఉండడం వల్ల,అలా జరుగుతూ ఉంటుంది.ఇలాంటి దోషాల విరుగుడుకు ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది.సాధారణంగా ఉప్పును చంద్రుడు మరియు శుక్రుడు ప్రతి రూపంగా భావిస్తారు.ఉప్పు మనిషి యొక్క అన్ని సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.నివారణలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కుటుంబంలో ఆర్థిక సమస్యలు..
కుటుంబ ఆర్థిక సమస్యలు తగ్గి,ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిటికెడు ఉప్పు వేసి,అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన పెట్టాలి.దీనితో ఇంటి ఆర్థికసమస్యలు తొలగి,వేగంగా వృద్ధి చెందుతుంది.
అశాంతి..
ఇంట్లో అశాంతిగా ఉన్నట్టు అనిపిస్తే,ఉప్పు నీటితో ఇళ్ళు తుడవడం వల్ల,ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.మరియు ఒక గాజుకప్పులో ఉప్పును నింపి,ఇంటి టాయిలెట్-బాత్‌రూమ్‌లో పెట్టవచ్చు.ఇలా చేయడంతో కూడా ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి,శాంతి నెలకొంటుంది.
ఉద్యోగ సమస్యలు..
పురాణాల ప్రకారం,ఉద్యోగ రావాలన్నా,లేదా ఉన్న ఉద్యోగంలో పురోగతి సాదించాలి అన్నా,ఉప్పు నివారణ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఇంటిలో ఉప్పు దీపం పెట్టడం మంచిది.ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి, ఉప్పు దీపం పెట్టి,మరుసటి రోజు ఆ ఉప్పును పారె నీటిలో వేయడం లేదా,ఉప్పును కరిగించి  ఏదైనా చెట్టు చివర్లో వేయడం వంటివి చేయాలి.దీనితో క్రమంగా దోషాలు తొలగి, ఉద్యోగ సమస్యలు తొలుగుతాయి.
దృష్టి దోషాలు..
చిన్నపిల్లలకు స్నానం చేసే సమయంలో ఉప్పుతో దిష్టి తీసి,స్నానం చేయించడం వల్ల,ద్రుష్టి దోషాలు తొలుగుతాయి.మరియు వారానికి ఒకసారి ఉప్పు వేసిన నీటితో స్నానం చేయించినా,పిల్లలకు అలర్జీ సంబంధిత రోగాలు దరిచేరవు.
ఆరోగ్య సమస్యలు..
ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే,ఉప్పుతో నివారించుకోవచ్చు.దీని కోసం,ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి,వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తల దగ్గర ఉంచాలి.ఇలా వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చి,మళ్లీ కొత్త ఉప్పు వేయాలి. ఇలా చేయడం వల్ల,ఏవైనా దోషాలు ఉంటే తొలగి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: