బండి సంజయ్ ఆఫర్: తీర్థ యాత్రలు ఫ్రీ..
ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ నేను ఎవ్వరికి భయపడేదే లేదు.. శివాజీ చేతుల చేతులో కత్తి చూడు.. మేడ్చల్ జిల్లా యువత సత్తా చూడు.. సెక్యులరిజం అంటే ముస్లిం ముస్లిం చెప్పకోవచ్చు.. కాని హిందు హిందువని చెప్పుకోవాలంటే భయం.. తదుపరి రామ రాజ్యం వస్తుంది... అప్పుడు చత్రపతి శివాజి జయంతి అధికారికంగా జరుపుతాం. మనం ధర్మరక్షణ కోసం పని చేయాలి...మనకు ప్రతి రోజు పండగే.. వారానికో పండగ ...నీకు ఒక్క పండగైతే నాకేంటి భయ్.. అన్నారు బండి సంజయ్.
“ తెలంగాణ రాష్ట్రం లో హిందువులు అంటే అరెస్టు... మన పండగలకు అన్ని శాఖల అనుమతుల తీసుకొవాలా ? మన రామ రాజ్యం వస్తే 60 సం.. దాటిన అందరికీ శక్తి పీఠాలు ఉచితం పంపిస్తాం.. రామడు అయోధ్యలో పుట్టాడని చరిత్ర చెప్పిన సాక్ష్యం.... కాని అక్కడ గుడి కట్టా లంటే ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి.. మన దేవుళ్లను, గోమాతలని అవమానం చేస్తే చూస్తు ఊరుకోం.. చార్మినార్ నా అడ్డా అని ఒకడు కూశాడు.. ఏ గడ్డ ఐతే వాడి అడ్డా అన్నాడో అక్కడే మనం మన అడ్డా భాగ్యనగరం అని జై శ్రీ రాం అని గర్జించాం"
" నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు.. హిందూ నిద్ర పోడు... నిద్ర పోతున్నట్లు నటిస్తున్నారు... ఒకసారి కళ్ళు తెరిస్తే హిందు వ్యతిరేకులు మాడి మసై పోతారు.. రాజకీయ జెండాలు ప్రక్కకి పెట్టి కషాయ జెండా పట్డుకొని రామరాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.. అని బండి సంజయ్ పిలుపు ఇచ్చారు.