పూజలో ఉపయోగించిన పూలు ఎక్కడ ఉంచకూడదో తెలుసా..?

Divya
భగవంతుడికి ఎంత దీపం వెలిగించినా.. అగరవత్తుల దూపం వేసినా పువ్వులు లేనిదే ఆ పూజ పూర్తవదు అనేది వాస్తవం. పూలు లేని పూజ చూడడానికి కూడా అలంకరణగా అనిపించదు. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పూలను తెప్పించి మరీ పూజలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ అందమైన ప్రకృతిలో ఎన్నో అందమైన పువ్వులు కూడా మనకు లభ్యమవుతాయి..అంతేకాదు ఎంతో పవిత్రంగా స్వచ్ఛంగా వికసిస్తూ అందరినీ ఆకట్టుకుంటాయి.

సాధారణంగా ప్రకృతిలో ఎన్నో రకాల పువ్వులు అందంగా, రకరకాల రంగులలో, ఆకృతులలో వికసిస్తూ మనసుకు హాయిని కలిగిస్తాయి ఉంటాయి. ఈ పువ్వులు అందుకే ఈ పువ్వులతో భగవంతుడిని పూజించడం వల్ల ఎటువంటి కష్టాలు అయినా సరే తప్పకుండా వరాన్ని ప్రసాదిస్తాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక్కో భగవంతుడికి ఒక్కో రకమైన పువ్వు అలాగే ఒక్కో రంగు కలిగిన పువ్వు అంటే ఎంతో ప్రీతికరమట. అలా భగవంతుడికి మెచ్చిన పువ్వులతో పూజ చేయడం వల్ల మనకు కూడా శుభం కలుగుతుంది..

అంతేకాదు దేవాలయాల్లో ఈ పువ్వులతో భగవంతుడికి పూజ చేసిన తర్వాత అదే పువ్వులను భక్తులకు ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారు.. భక్తులు ఇటువంటి పువ్వులను పొరపాటున కూడా కొన్ని ప్రదేశాలలో ఉంచకూడదు. దేవుని సన్నిధిలో ఇచ్చిన ఆ పువ్వులను మనం ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఏదైనా ఆలయం లేదా మన పూజ గది నుంచి ప్రసాదంగా తీసుకున్న స్వామివారి పుష్పాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా మనకు దగ్గరగా అంటే ఆడవాళ్ళయితే హ్యాండ్ బ్యాగ్ లో ను మగవారైతే తమ పర్స్ లో పెట్టుకోవడం మంచిదట. ఈ పువ్వులు ఎప్పుడూ మన దగ్గరే ఉండడంవల్ల మనకు రక్షణ గా ఉంటాయి అని, చెడు శక్తులు రావు అని చెబుతున్నారు. కాకపోతే కొంతమంది మహిళలు స్వామి వారి దగ్గర తీసుకున్న పువ్వులను తలలో పెట్టుకుని ,అవి వాడి పోయిన తర్వాత తిరిగి ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఈ పూలను ఎవరు తొక్కని ప్రదేశములో వేయాలట.
అంతేకాదు వివాహిత స్త్రీలు ఈ పుష్పాలను పెట్టుకొని పడకగదిలోకి వెళ్ళకూడదు అని శాస్త్రం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: