ఏపీ: పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్న 4.6 లక్షల మంది.. ఎవరికి ఎక్కువ పడ్డాయో..?

Suma Kallamadi
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాత ఉద్యోగులు, కొత్తగా నియమితమైన ఉద్యోగులు సాధారణ పోలింగ్ తేదీ సమయంలో పోలింగ్ కేంద్రంలో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు వారు సొంత నియోజకవర్గంలో ఉండరు. ఆ సమయంలో ఓటు హక్కు వినియోగించాలి ఎక్కువ లేరు. అందుకే వీరికి ప్రత్యేక ఓటింగ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. కాగా ఏపీలో ఈ నెల 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కును ఉపయోగించుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4.6 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. అంటే దాదాపు 100 కి 99 శాతం మంది ఓట్లు వేశారు. అయితే టీడీపీ వాళ్లు తమకే ఈ ఓట్లు అన్ని పడిపోయి ఉంటాయనే ధీమాని వ్యక్తం చేస్తోంది. వైసీపీ మాత్రం 50-50 ఓట్లు పడి ఉంటాయేమో అని భావిస్తోంది. రిజల్ట్స్ రోజు తప్ప ఈ ఓట్లు ఎవరికి పడిపోయాయో ఊహించడం కష్టం. వీళ్ళు ఎవరికీ ఓటేశారనేది చెప్పడానికి అనేక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటో తారీకు శాలరీ పడటం లేని కారణంగా కొందరు అధికార పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయవచ్చు. ఒకవేళ వైసీపీ పాలనలో ప్రమోషన్స్ త్వరగా వచ్చి ఉంటే దానికే ఉద్యోగులు ఓటు వేయవచ్చు.  
 ఇకపోతే సర్వేలు వైసీపీ పార్టీ డీసెంట్ మెజారిటీతో ఈసారి అధికారంలోకి మళ్ళీ వస్తుందని అంచనాలు వేశాయి. టీడీపీ, జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసిన వైసీపీని ఢీకొట్టడం అసాధ్యమని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలు 99% సంక్షేమ పథకాల అమలు కారణంగా ఆయన ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ+ కూటమి గెలవడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బు పంపిణీ విషయంలో కూడా వైసీపీకి బలమైన పోటీ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: