ఆవేశం: తెలుగులో ఆ సూపర్ ప్లాన్ వేశారా?

Purushottham Vinay
ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. జితు మాధవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గత నెల మలయాళంలో రిలీజై సూపర్ హిట్ అయ్యింది.లో  బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 150 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఫాహద్ ఫాజిల్ మరోసారి తన వర్సటైల్ యాక్టింగ్ తో ఎంతగానో అలరించాడు. గ్యాంగ్ స్టర్ కథతో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అందించవచ్చని ఫాహద్ ప్రూవ్ చేశారు. ఐతే ఆవేశం మూవీ థియేట్రికల్ చూసిన వారు.. థియేట్రికల్ వెర్షన్ మిస్ అయిన వారు ఇలా అందరు కూడా సినిమా ఓటీటీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో ఆవేశం మూవీ రిలీజైంది. అయితే ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. చెప్పాలంటే ఆవేశం తెలుగు వెర్షన్ కోసం ఆడియన్స్ బాగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళ వెర్షన్ ని మాత్రమే అందుబాటులో ఉంచారు ఈ మేకర్స్. అయితే దీని వెనుక రీజన్ ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.


మలయాళంలో హిట్ అయిన ప్రతి సినిమా తెలుగు తమిళ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే అక్కడ హిట్ అయిన ప్రేమలు, మంజుమ్మల్ బోయ్స్ సినిమాలు అలానే డబ్ చేసి రిలీజ్ చేయగా తెలుగు, తమిళంలో కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. అదే దారిలో ఆవేశం సినిమా కూడా డబ్ చేసి తెలుగులో తమిళంలో రిలీజ్ చేసే ప్లాన్ ఏదైనా ఉందని తెలుస్తుంది. లేదా ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసినా చేసే అవకాశం కూడా ఉంది.అందుకే తెలుగు వెర్షన్ ఆవేశం మూవీని రిలీజ్ చేయలేదని సమాచారం తెలుస్తుంది. అయితే ఆవేశం ఓటీటీ రిలీజ్ అనగానే సినిమాను తెలుగులో చూడొచ్చని అనుకున్న తెలుగు ఆడియన్స్ కు మాత్రం ప్రస్తుతం షాక్ తగిలినట్టు అయ్యింది. ఎందుకంటే పుష్ప ద్వారా ఫాహద్ ఫాజిల్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆవేశం సినిమాని రీమేక్ చేస్తారా లేదా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ప్రస్తుతం ఫాహద్ ఫాజిల్ అల్లు  పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. పుష్ప 1 లో ఎస్పీగా చివర్లో అదరగొట్టిన ఫాహద్ పుష్ప 2 లో కూడా అంతకుమించి ఇంప్రెస్ చేస్తారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: