పవన్ : విస్తుపోయే నిజాలు చెప్పిన మహేష్ పోతినేని..!

Divya
జనసేన పార్టీకి రాజీనామా చేసి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి మహేష్ పోతినేని వరుస పెట్టి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.. నిన్న కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ మీద భారీ అవినీతి ఆరోపణలు చేశారు పవన్ పోతినేని.. అందులో ముఖ్యమైన పాయింట్ మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బినామీ నర్రాశ్రీనివాస్ మిత్రుడు వెంకటేశ్వరరావు పేరుమీద రూ .100 కోట్లు విలువైన 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.. ఆధార్ కార్డు పైన అనుమానాలు ఉన్నాయి.. వెంకటేశ్వరరావుది గుంటూరు అయితే.. చెల్లించిన బ్యాంకు చెల్లింపు అంతా కూడా హైదరాబాద్ ఐసిఐసి బ్యాంకు నుండి జరిగిందని వెల్లడించారు. ఇందులో రెండు రిజిస్ట్రేషన్లకు  వెంకటేశ్వరరావు హాజరుకాగా మరో రెండు రిజిస్ట్రేషన్ లకు నర్రాశ్రీనివాసరావు కార్ డ్రైవర్  వి.నవీన్ కుమార్..హాజరయ్యారని తెలిపారు.

రంగారెడ్డి జిల్లా సంకరపల్లిలో.. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ 14 ఎకరాలు అఫిడవిట్లో చూపించారు.. కానీ అది 48 నుంచి 55 ఎకరాలు ఉందని తెలిపారు. పాతది 14 ఎకరాలు అయితే.. 2019 ఎన్నికల తర్వాత మరో 35 ఎకరాలు కొన్నారని తెలిపారు.. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్ల రూపాయలు.. సుమారుగా రూ .200 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు తెలిపారు.అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారని తెలిపారు మహేష్ పోతినేని.

2019లో చాలామంది ఎన్నారైలు, కాపు నేతలు సైతం రూ.125 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.. వాటిని వసూలు చేసింది పివి రావు , ఆర్ఆర్ రామ్మోహన్ అని తెలిపారు. చింతల పార్థసారథి, మొద్దు శెట్టి కృష్ణారావు.. ఇందులో 90% నగదు రూపంలో 10 శాతం డిడిల రూపంలో ఇచ్చారని తెలిపారు.. ఆ డబ్బుల వివరాలు అడిగినందుకే వారి మధ్య తగాదాలు మొదలయ్యాయని తెలిపారు మహేష్ పోతినేని. పవన్ నిజస్వరూపం తెలియాలి అంటే.. 2018, 24  వరకు చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ తప్ప ఆయన కుటుంబంలోని అందరి ఆస్తులు బయటపెట్టాలని తెలిపారు.

పవన్ కళ్యాణ్ హైదరాబాదులో కొనుగోలు 4,200 గజాల విలువైన స్థలాన్ని 50 కోట్లగా చూపించారు.. దానిని 2021 ,24 మధ్య కొనుగోలు చేశారని తెలిపారు.. నిజానికి దాని విలువ సుమారుగా రూ .125 కోట్లని తెలిపారు మహేష్ పోతినేని.. సినిమాలు లేకుండానే మిగిలిన రూ .75 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.. ఫిక్స్డ్ డిపాజిట్ లో పవన్ కళ్యాణ్ కి 28 కోట్లు ఉన్నాయని చూపించారు.. బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని.. చూపించారు..  రూ.28 కోట్లు అప్పు ఉండగా ఎక్కువ వడ్డీకి బయటనుంచి అప్పు తెచ్చుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. బయటే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఈయనకు బినామీలు ఉన్నారు.. అలాంటి వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్, పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్, పవన్ పిన్ని కొడుకు అమెరికాలో అనిల్ అలాగే తంగెల ఉదయ శ్రీనివాస్, తంగెల సుమ వీళ్లంతా ఆయన బినామీలే అంటూ వివరించారు. ఇవే కాకుండా చాలా ఆస్తులను అగ్రిమెంట్ మీద స్వాధీనం చేసుకున్నారని మహేష్ పోతినేని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: