మహిళలు ఏ రోజున.. తలస్నానం చేస్తే మేలో తెలుసా..?

Divya
తరుచుగా ఆడవారు తలస్నానం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రోజున తలస్నానం చేయడం తప్పని కొంతమంది తెలియజేస్తున్నారు. అంటే వారంలో ప్రతిరోజు చేసేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారంలో కేవలం శుక్రవారం రోజున మాత్రమే తలస్నానం చేసే వారికి ఇలా స్నానం చేయడం మంచిది కాదని కొంతమంది పండితులు తెలియజేస్తుంది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.

ఆడవారు ముఖ్యంగా మంగళ వారం, శుక్రవారం రోజున తల స్నానం చేయరాదట. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే వారికి దురదృష్టం, అష్ట ఐశ్వర్యాలు దూరమవుతాయని  హెచ్చరిస్తున్నారు పండితులు. అదే శనివారం రోజున తలస్నానం చేసినట్లయితే వారికి అష్టఐశ్వర్యాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏ రోజునా తల స్నానం చేస్తే వాటి ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
1) ఆదివారం:
ఈ రోజు తల స్నానం చేస్తే మనసులో అంతా కలత ఉంటుంది. అంతేకాకుండా అందం కూడా పోతుందట.
2). సోమవారం:
ఈ రోజు తల స్నానం చేస్తే వారు ఆ రోజంతా భయపడుతూ, కలవర చేందుతారట. ఇక అంతే కాకుండా ఫేస్ లో కూడా చాలా డల్ నెస్ కనిపిస్తుంది.
3). మంగళవారం:
ఈ రోజున తలస్నానం చేస్తే ఆయుష్షు తగ్గుతుందట. అంతే కాకుండా విరోధములు ఎక్కువగా ఉంటాయి.
4) బుధవారం:
ఈ రోజున తల స్నానం చేస్తే మంచి జరుగుతుంది. అంతేకాకుండా అష్ట ఐశ్వర్యాలు వస్తాయట.
5). గురువారం:
ఈ రోజున తలస్నానం చేస్తే అశాంతితో ఉంటారు. డబ్బు కూడా చేతిలో నిలువకుండా వెళ్ళిపోతుంది.
6). శుక్రవారం:
అయితే ఈ రోజున రెండవసారి తలస్నానం చేసుకోవచ్చు. అంటే బుధవారం, చేసిన తర్వాత శుక్రవారం చేసుకోవచ్చు. కేవలం ఆడవారు మాత్రమే ఇది వర్తిస్తుంది.
7). శనివారం:
ఈ రోజు తలస్నానం చేయడం కుటుంబ సౌఖ్యం తో పాటు, ధన లాభం, ఆయుష్ అభివృద్ధి కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టుని అలాగే వదిలేయాలేయారాదు. అలా చేస్తే దుష్ట శక్తులు తమ వెంట్రుకల గుండా ప్రయాణిస్తాయట.
ముఖ్యంగా అలా విరబోసుకున్న ప్పుడు వెంట్రుకల చివర ముడివేయడం మంచిదట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: