పోలింగ్ రోజే పవన్ మూడో భార్యకు విడాకులు... ఇలా జరిగిందేంట్రా..?
ఈ ప్రచారంపై జనసేన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే పోలింగ్ రోజు పవన్ కళ్యాణ్ ఈ విడాకుల ప్రచారానికి తెరదించేశారు. అన్నా లెజినోవా తో కలిసి పవన్ కళ్యాణ్ లేరని ఆమె సింగపూర్లో ఉంటున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. మూడో భార్యకు కూడా ఆయన విడాకులు ఇచ్చేసారని జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు రాసుకుంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు. ఇటు వైసీపీ వాళ్లు కూడా పవన్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చేసారని ప్రచారం చేశారు. ఇటీవల పిఠాపురంలో పవన్ గృహప్రవేశానికి కూడా లెజనోవా వెళ్లకపోవడంతో రకరకాల సందేహాలకు కారణమైంది.
మరీ ముఖ్యంగా ఇటీవల జనసేన నుంచి బయటికి వచ్చిన విజయవాడకు చెందిన పోతిన మహేష్ కూడా ప్రత్యేకంగా పవన్ మూడో భార్య గురించి కామెంట్లు చేశారు. పవన్ తన గృహప్రవేశానికి భార్యను తీసుకువెళ్లాలని ఆయన సూచించినది జరగలేదు. దీంతో పవన్ తన మూడో భార్య లెజినోవాతో కలిసి ఉండటం లేదని ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి ఈరోజు ఓటింగ్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ పులిస్టాప్ పెట్టేశారు. పోలింగ్ పురస్కరించుకుని మంగళగిరిలో అన్నా లెజినోవాతో కలిసి ఆయన ఓటు వేయడానికి వెళ్లారు. దీంతో పవన్ దంపతులు విడిపోలేదని చెప్పినట్టు అయింది. ఇక పవన్ కళ్యాణ్ దంపతులను చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపించడం విశేషం.