రాయలసీమ (కుప్పం): తమిళ్ తంబీల దెబ్బకి.. టీడీపీలో టెన్షన్..!

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సైతం జోరుగా ప్రసారం సాగుతున్నది.. తమిళ వాసులు ఉంటున్న జిల్లాలో చిత్తూరు జిల్లా కూడా ఒకటి.. టిడిపి వైసిపి నాయకులు గెలుపోటములు సైతం తమిళ తంబీలు చేతుల్లోనే ఉన్నాయనే విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే రోజా గెలవాలన్నా కూడా తమిళ తంబీలు గెలిపించాల్సింది అన్నట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా కు చెందిన లక్షలాది మంది వివిధ కారణాల చేత చెన్నైతో పాటు కోయంబత్తూరు, వేలూరు ,అంబూరు ,సేలం తదితర ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు.

తమిళనాడులో వ్యాపారాలు ఉద్యోగులు సైతం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నిలబడిన చోట కుప్పంలో కూడా గెలవాలి అంటే కచ్చితంగా తమిళ తంబీలు ఓటు వేయాల్సిందే అందుకే చిత్తూరు నియోజవర్గం అంతా కూడా తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుందట అక్కడున్న లక్షలాదిమంది తమిళ్లో ఆంధ్రప్రదేశ్లోని స్థిరపడిపోయారు. ఈ నియోజకవర్గాలలో ఎవరు గెలవాలన్నా కూడా కచ్చితంగా తమిళ తంబీలు  కనికరించాల్సిందే నగరి ప్రాంతంలో దాదాపుగా 55,000 మంది తమిళ ఓటర్సు ఉన్నారు.. గతంలో రెండు సార్లు రోజా వీరి వల్లే గెలిచిందట. ఇప్పుడు కూడా గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సైతం తమిళంలో మాట్లాడి తమిళ ఓటర్లను ఆకర్షించడానికి పలు రకాల ప్రయత్నాలు చేశారు.. దాదాపుగా ఆసరౌండింగ్ లో పరిసరాలలో 20వేల తమిళ ఓటర్సు ఉన్నారు. కుప్పం ను వైసిపి పార్టీ టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి చంద్ర బాబుకు చెక్ పెట్టే విధంగా పలు రకాల ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా అక్కడ చంద్రబాబు మీద పోటీగా భరత్ ను నిలబెట్టారు.. జగన్ కుప్పంలో భరత్ ను గెలిపిస్తే క్యాబినెట్లోకి తీసుకుంటానంటూ కూడా మాట ఇచ్చారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కుప్పంలో చంద్రబాబుకు ఎదురీత ఈదుతోంది అనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అందుకనే తన భార్య భువనేశ్వరి కూడా అక్కడ విస్తృతంగా ప్రచారం చేసింది.. ముఖ్యంగా చంద్రబాబు ఓటమి సంకేతాలు రావడంతో నారా కుటుంబం కుప్పంలోనే ముఖం వేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో పలువురు నేతలు టిడిపి కార్యకర్తలు కూడా తలలు పట్టుకుంటున్నారు మరి ఇలాంటి సమయంలో ఏ మేరకు కుప్పం ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా తీర్పునిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: