గుడివాడ: పోలింగ్ రోజు కొడాలి జోరు.... టీడీపీ రామోరు బేజారు...!
జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో చంద్రబాబు 2004 ఎన్నికలలో కొడాలి నాని కి గుడివాడ టీడీపీ సీటు ఇచ్చారు. 2004, 2009 ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచిన నాని ఆ తర్వాత రెండు ఎన్నికలలోను వైసీపీ నుంచి గెలిచారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వీరిని వ్యక్తితంగా టార్గెట్ చేస్తూ టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. ఎన్నికలలో నానిని ఓడించాలని చంద్రబాబు ఎన్నారై వెనిగండ్ల రామును రంగంలోకి దింపారు. గత ఏడాదిన్నర కాలంగా రాము నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రాము భార్య సుఖద మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అటు ఎస్సీ ఓట్లపై కూడా వీరు యేడాది కాలంగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుంటూ వచ్చారు.
ఎన్నికలకు నెలకు ముందు వరకు గట్టి పోటీ అన్నారు. అయితే పోలింగ్ రోజు అంచనాలు చూస్తే కొడాలి నాని కి అనుకూలంగా గుడివాడ ఓటరు ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా గుడివాడ రూరల్ - గుడివాడ టౌన్ - నందివాడ మండలాలలో నానికి అనుకూలంగా పోలింగ్ జరుగుతుందని.. పల్లెలలో ఓటర్లు ఫ్యాన్ సింబల్ కు ఓట్లేసి గెలిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్క గుడ్లవల్లేరు మండలం లో మాత్రమే నానికి కాస్తో కూస్తో మెజార్టీ తగ్గవచ్చని అంటున్నారు. ఓ వరాల్ గా గుడివాడ ఓటరు ఐదో సారి కొడాలి నానికి పట్టం కట్టడం ఖాయమైపోయిందని టాక్ ?