పాపంకుశ ఏకాదశి : పాపాల నుండి విముక్తి కలగాలంటే...
సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉంటాయి. శుక్ల, కృష్ణ పక్షాల సమయంలో ఒక నెలలో రెండు ఏకాదశిలు ఉంటాయి. ఏదేమైనా హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో మరిన్ని నెలలు (లీపు నెలలు) చేర్చబడినప్పుడు ఏకాదశి సంఖ్య 26 కి పెరుగుతుంది. ఇది దాదాపు 32 నెలలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం భక్తులు రెండు అదనపు ఏకాదశి ఉపవాసాలను పాటిస్తారు. వాటిలో ఒకటి అక్టోబర్ 16, 2021 ఆచరించబడుతుంది. శుక్ల పక్షంలోని అశ్విని నెల ఏకాదశిని పాపంకుశ ఏకాదశి అంటారు. ఈ ప్రత్యేక రోజున ఉపవాసం ఉంటే జన్మ చక్రం నుండి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.
ఈ రోజు, విష్ణువును పూర్తి ఆచారాలతో పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఈ రోజున మీ జీవితం ధన్యం కావడానికి విష్ణువును మీ శ్రద్ధ పెట్టి పరిపూర్ణ మనస్సుతో ధ్యానం చేయండి.
పాపంకుశ ఏకాదశి 2021: తేదీ మరియు శుభ సమయం
తేదీ - అక్టోబర్ 16, 2021
ఏకాదశి తేదీ మొదలయ్యేది 15 అక్టోబర్ 2021 సాయంత్రం 06:02 గంటలకు
ఏకాదశి తేదీ ముగిసేది 16 అక్టోబర్ 2021 సాయంత్రం 05:37 గంటలకు
పరణ సమయం - 17 అక్టోబర్ 2021 ఉదయం 06:23 నుండి 08:40 వరకు
హిందూ గ్రంథాల ప్రకారం ఏకాదశి ఉపవాసం తర్వాత రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి ప్రాణాన్ని నిర్వహిస్తారు. ద్వాదశి తిథి లోపలే పరణ చేయాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ ||