వినాయకుని నిమజ్జనంలో పాటించాల్సిన నియమాలివే?
ఇలా పూజ అయిన తర్వాత తదుపరి కార్యక్రమం గణేశుని నిమజ్జనం. ఇంట్లో విగ్రహాన్ని తెచ్చుకుని పూజించేవారు కొందరు తొలి రోజు సాయంత్రమే వినాయకుడిని నిమజ్జనం చేస్తే, మరికొందరు మూడు రోజులు, అయిదు రోజులకు, తొమ్మిది రోజులకు నిమజ్జనం చేస్తుంటారు. అయితే చాలా మంది మాత్రం తొలి రోజునే వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఎందుకంటే వినాయకుడి పూజ ఎంతో నియమ నిబంధనలతో నిష్టతో చేయాలి. కాబట్టి చాలా మంది వినాయకచవితి రోజు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని ఎంతో ఆడంబరంగా, విశిష్టంగా పూజించి ఆ రోజునే నిమజ్జనం చేస్తారు. అయితే వినాయకుడిని నిమజ్జనం చేసేముందు కొన్ని నియమాలను తప్పక పాటించాలి.
1. మట్టి విగ్రహాలను మాత్రమే పూజకు వాడటం ఉత్తమం.
2.సాయంత్రం దీపారాధన చేయక ముందే నిమజ్జనం చేయాలి.
3. ముందుగా విఘ్నేశ్వరునికి నమస్కరించుకుని నెమ్మదిగా విగ్రహాన్ని తీయాలి.
4. పత్రి, ఫలాలను నిమజ్జనం చేయరాదు. వాటిని దానంగా ఇవ్వడం ఉత్తమం.
5. వినాయకుని నిమజ్జనం నదులు, సముద్రాలలో మాత్రమే చేయాలి. కానీ చాలా మంది తమ ఇంటికి దగ్గర్లో ఉండే కాలువల్లో, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు నది లేదా సముద్రంలో చేయడానికి వీలు కానప్పుడు కుండలో లేదా బిందెలో అయినా పూర్తిగా నీళ్లను పోసి అందులో నిమజ్జనం చేయడం ఉత్తమం. ఆ నీటిని ఇంట్లోని మొక్కలకు పోయాలి. కానీ గుర్తు పెట్టుకోండి ఆ విగ్రహాలు మట్టి విగ్రహాలు అయితేనే మొక్కలకు పోయాలి.
6. గణేశుని నిమజ్జనం చేసేటప్పుడు జై గణేష అని తప్పక చెప్పాలి.
7. మంగళ, శుక్రవారాలలో వినాయకుని నిమజ్జనం చేయరాదు.
కాబట్టి ఈరోజు నిమజ్జనం చేయకండి మూడు రోజుల పాటు రోజూ దీప దూపాలు, నైవేద్యాలు అందించి మూడవ రోజు సాయంత్రం నిమజ్జనం చేయడం మంచిది.