గృహ నిర్మాణం చేస్తున్నారా ఈ విషయం గుర్తుంచుకోండి ?

VAMSI
సొంత ఇల్లు కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత నివాసం ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ కష్టపడి ప్రయత్నిస్తే అంత అసాద్యేమేమి కాదు. దానికి తోడు ఆ దేవుని చల్లని చూపు మీపై ఉండి, అదృష్టం కలిసి వస్తే మీ కల తప్పక నెరవేరుతుంది.  అయితే ప్రతి ప్రత్యేకమైన విషయానికి మంచి రోజు చూసుకుని  చేసే హిందువులు సొంత ఇల్లు కట్టేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరకనే అనలేదు. మనం కట్టుకోబోయే మన సొంతిల్లు మనకు అన్ని రకాలుగా కలిసి వచ్చేలా ఉండాలి, మన ఇల్లు బాగా కలిసొచ్చి అంతా మంచే జరగాలి తప్ప, ఎటువంటి అశుభ పరిణామాలు చోటు చేసుకోకూడదని అనుకుంటే ఇల్లు నిర్మాణం పనులు ప్రారంభించే ముందు కూడా మంచి రోజు చూసుకొని భూమి పూజ చేసి ప్రారంభించాల్సి ఉంటుంది. 

అప్పుడే ఆ దేవుని యొక్క చల్లని అనుగ్రహం మన కుటుంబంపై ఉండి అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఆ ఇల్లు నిర్మాణం పూర్తవుతుంది. అదే విధంగా ఆ ఇంట్లో ఉండబోయే వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. గృహ నిర్మాణానికి బుధవారం, గురువారం, శుక్రవారం మాత్రమే ప్రశస్తమైనవిగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మూడు వార దినములలో భూమి పూజ చేయుట శుభ ప్రదమని చెప్పబడుతోంది. మిగతా సోమవారము మంగళవారము శని ఆదివారాలు భూమి పూజకు అంత మంచివి కావని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే సోమ మరియు శని రెండు వారాలు కూడా కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని తేదీల ప్రకారం చూసుకుని ముహూర్తం పెట్టుకుంటే ఈ రెండు వారాలు కూడా భూమి పూజకు మంచిదే అంటున్నారు శాస్త్రం తెలిసిన వారు. అయితే ఆది మరియు మంగళ వారాలు మాత్రం గృహ కార్యములు అన్నిటికీ అంత మంచివి కావని చెప్పబడ్డాయి. కావున భూమి పూజ చేసేముందు ఖచ్చితంగా వార వజ్రాలను చూసుకొని పూజారుల సలహా మేరకు ముహూర్తం నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: