జగన్ కు పోటీనివ్వాలంటే అక్కడ కూడా జగనే ఉండాలి.. ఆ వ్యక్తి కామెంట్స్ నిజమేగా?
పేదలను టార్గెట్ చేస్తూ జగన్ అమలు చేసిన నవరత్నాలు ఆయనకు తిరిగి ఓట్ల రూపంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. జగన్ కు సీట్ల సంఖ్య తగ్గినా ఆయనకే ఎడ్జ్ ఉంటుందని కళ్యాణ్ దిలీప్ సుంకర పేర్కొన్నారు. జగన్ పథకాలతో లబ్ధి పొందిన వాళ్లు మళ్లీ ఆయనకే ఓటేస్తారని కళ్యాణ్ దిలీప్ సుంకర పేర్కొన్నారు. పవన్ గతంలో టికెట్ ఇస్తానని చెప్పారు కానీ నాకు టికెట్ కావాలని ఎప్పుడూ అడగలేదని ఆయన తెలిపారు.
నేను అడగని టికెట్ నాకు రాలేదని ఎందుకు బాధ ఉంటుందని కళ్యాణ్ దిలీప్ సుంకర పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి విశిష్ట అధికారాలు మాత్రమే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ల్యాండ్ పట్టుకెళ్లడం జరగని కళ్యాణ్ దిలీప్ సుంకర పేర్కొన్నారు. ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఎవరి ల్యాండ్ లాక్కోలేరని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ ఎదిగిన తీరు ఇష్టమని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు.
జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని ఆయన పార్టీ పెట్టి ఎదిగిన విషయంలో గ్రేట్ అని ఆయన అన్నారు. 10 సంవత్సరాల సమయంలో జగన్ సీఎం అయ్యారని జగన్ ఎంతో కష్టపడి మంచి స్టేజ్ కు వచ్చారని దిలీప్ సుంకర అన్నారు. సంకల్పానికి భగవంతుని కృప తోడైతే మాత్రమే మళ్లీ నిలబడిన వ్యక్తి జగన్ అని ఆయన కామెంట్లు చేశారు. కళ్యాణ్ దిలీప్ సుంకర చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.