ఏపీ: సమాజంలో పేరు ఉన్న వాళ్లే కానీ.. సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యంపై కౄర దాడి..?

Suma Kallamadi

ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం. నచ్చిన నేతలను ఎన్నుకొని, దేశంలో సుపరిపాలన సాగేలాగా నిర్ణయం తీసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. అయితే వీరిని మ్యానిప్యులేట్ చేయాలని, పక్కదారి పట్టించి సొంత ప్రయోజనాలను పొందాలని కొందరు రాజకీయ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేయడం పరిపాటుగా మారింది. ఇలాంటివారిని కడిగి పారేయాల్సిన బాధ్యత జర్నలిస్టుల ది, పత్రికలది అని చెప్పుకోవచ్చు. కానీ ఆ పత్రికలు కూడా జర్నలిజం విలువలను మరిచి దిగజారుడు తనంతో ప్రవర్తిస్తున్నాయి.
పాత్రికేయ విలువలను తుంగలోకి తొక్కిన పత్రికలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మొదటి వరుసగా ఉంటుంది. ఈ పత్రిక ఎండీ రాధాకృష్ణ చంద్రబాబుకి ఓటేయాలని నిస్సిగ్గుగా తొలి పలుకు, ఎడిటోరియల్స్ రాస్తుంటాడు. ప్రజలను ప్రభావితం చేయడానికి జగన్, ఇతర పార్టీ వాళ్ళ గురించి తన నోటికొచ్చినట్టు రాసేస్తుంటాడు. ఆయన రాసే సంపాదకీయాలు ప్రజలను నమ్మించేలాగానే ఉంటాయి. చాలామంది వీటిని చదివి మారకపోవచ్చులే కానీ అంతగా అవగాహన లేని వారు రాధాకృష్ణ రాసేది నిజమే అనుకోవచ్చు. రాధాకృష్ణ ఎప్పుడో తెగించేసి ఇలాంటి విలువలేని ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన బాటలోనే ఈనాడు కూడా నడవటం ప్రారంభించింది.
 ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలివుండగా జగన్ కు ఓటేయవద్దు అని ప్రజలకు పిలుపు ఇస్తూ ఒక పెద్ద ఎడిటోరియల్ రాసేసింది. ఒకరికి ఎందుకు ఓటెయ్యాలి? ఫలానా వాళ్లకు ఓటు వేయకూడదు అంటూ ఏ పత్రికకు రాసే, ప్రజలను పక్కదారి పట్టించే హక్కు లేదు. ఎడిటోరియల్ అంటే ఒక అంశం గురించి చాలా సెర్చ్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా రాసే ఒక ఆర్టికల్. ఇది ఒకరి వైపే అనుకూలంగా ఉండకూడదు. న్యూట్రల్ గా వాస్తవాలను ప్రస్తావిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ ఈనాడు ఈరోజు రాసిన ఎడిటోరియల్ మాత్రం జగన్ పై కక్ష కట్టి ఆయనను ఎట్లాగైనా గద్దె దించాలనే ఉద్దేశంతో రాసినట్టుగా ఉంది. రామోజీరావు  "ఈనాడు" ఇంతకుముందు ఇంత నేరుగా బరి తెగించి మరీ ఎడిటోరియల్స్ రాసింది లేదు. చివరికి అది కూడా ఇప్పుడు బట్టలిప్పేసి విలువలను మంటగలిపేసింది. దీనిని ఈనాడు ఓనర్ రామోజీరావు ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఘోరమైన దాడి అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: