జగన్ చరిత్రను తిరగరాస్తారా.. లబ్ధిదారులు ఓటేసినా ఏకంగా అన్ని సీట్లు వస్తాయా?

Reddy P Rajasekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా విజయం సాధించిన వాళ్లు తక్కువమంది ఉండగా నవ్యాంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా పాలన సాగిస్తే మరో ఐదేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా పాలన సాగింది. చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తే మాత్రం జగన్ పాలన ఎన్నో రెట్లు అద్భుతంగా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
 
అయితే ఏపీలో కులం, మతం, ప్రాంతం అనే తేడాల్లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత, చరిత్ర జగన్ సొంతమనే సంగతి తెలిసిందే. జగన్ పథకాలు పొందిన లబ్ధిదారులు ఆయనకు ఓటేసినా సులువుగా 165 నుంచి 170 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుంది. ఇన్ని స్థానాల్లో విజయం సాధించడం వాస్తవంగా సాధ్యం కాకపోయినా వైసీపీ 135 నుంచి 140 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని తెలుస్తోంది.
 
ముస్లిం మైనార్టీల ఓట్లు వైసీపీకి ఫేవర్ గా ఉండటం ఆ పార్టీకి మరింత ప్లస్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ లా గొప్పగా పాలించే నేతలు అరుదుగా ఉంటారని జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు సైతం స్పూర్తిగా నిలిచాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ మార్క్ పాలన ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం అనే చెప్పాలి.
 
జగన్ తెచ్చిన సంస్కరణలు ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయని చెప్పవచ్చు. వైఎస్సార్ తర్వాత ఆ స్థాయి నేతగా జగన్ గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ప్రశంసలను అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే మూడు రాజధానుల నిర్ణయం అమలు కావడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ఓటర్లు సైతం ఈ ఎన్నికల్లో తమ ఓటు వైసీపీకే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: