నెల్లూరు : వైసీపీ దెబ్బకు చేతులెత్తేసిన ప్ర‌భాక‌ర్‌రెడ్డి..ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటో..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో రేపు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. ఎన్నికలలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా అధికారులు భద్రతలు కట్టు దిట్టం చేసారు.. ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.అధికార పార్టీ వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనలేక ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ, జనసేన, బీజేపీ లతో కలిసి కూటమిగా ఏర్పడింది.కూటమిగా ఏర్పడి అధికార వైసీపీ పై ఎప్పుడూ లేనంత ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించారు..నేరవేర్చలేని హామీలతో ఈ సారి తమను గెలిపించాలని అంటూ కూటమి జోరుగా ప్రచారం చేసింది.. కానీప్రజల మనసు గెల్చుకున్న జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఐదేళ్లలో తనతో ఉన్నవారంత దూరమైన కూడా ప్రజలు జగన్ కు అండగా నిలిచారు. 

గత ఎన్నికలలో జగన్ ఫేమ్ తో గెలిచిన వారంత జగన్ ను విబేధించి టీడీపీ లో చేరారు..వారిలో నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు . గత ఎన్నికలలో నెల్లూరు ఎంపీగా గెల్చిన వేమి రెడ్డి కొన్ని కారణాల వల్ల జగన్ ను విబేధించి టీడీపీ లో చేరారు. వైసీపీ లో వున్నంతవరకు టీడీపీ ని విమర్శిస్తూ వచ్చిన ప్రభాకర్ రెడ్డి టీడీపీ లో చేరి జగన్ ను విమర్శించడం మొదలు పెట్టారు.. అయితే నెల్లూరు ప్రజలు మాత్రం వేమిరెడ్డిని నమ్మడం లేదు.జగన్ ఈ సారి నెల్లూరు ఎంపీగా విజయ్ సాయి రెడ్డిని నిలబెట్టారు.. కూటమి అభ్యర్దిగా నిలబడుతున్న వేమిరెడ్డికి ఈ సారి ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చడనే నమ్మకం ప్రజలలో గట్టిగా ఉంది. చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన జగన్ ను గెల్పించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా వున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిల్చున్న విజయ్ సాయి రెడ్డి భారీ మెజారిటీతో గెలవనున్నారు..గత ఎన్నికలలో నెల్లూరు లో టీడీపీకి అనుకున్నంత గొప్పగా సీట్లు రాలేదు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఈ సారి కూడా అలాంటి ఫలితాలే వెలవడనున్నాయని చాలా సర్వేలు తెలిపాయి.మరి ఈ ఎన్నికల తరువాత టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: