బ్రేకింగ్: వైసీపీపై ధ్వజమెత్తిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి... మాస్ వార్నింగ్!

Suma Kallamadi
ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోందని, అటువంటి చర్యలకు తక్షణమే అడ్డుకట్ట వేయకుంటే చర్యలు చాలా దారుణంగా ఉండబోతాయని టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో వైసీపీ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు కాబడిన ఓ క్లిప్పింగ్‌ను షేర్ చేయడం జరిగింది.
విషయం ఏమిటంటే... చంద్రగిరి మండలం, ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడిచేస్తున్నారంటూ వైసీపీ తన ఆఫీసియల్ ఎక్స్‌ ఖాతాలో దానికి సంబంధించినటువంటి ఓ వీడియోను షేర్ చేసింది. అయితే ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించిన బుచ్చయ్య చౌదరి ఎక్స్‌లో ఈ విధంగా స్పందించారు. అది ఒక ఫేక్ వీడియో అని, గంజాయి, జే-బ్రాండ్ తాగి ఓటమికి మీరంటే మీరు కారణం అంటూ వైసీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్న వీడియోని ఇలా తయారు చెయ్యడం ఎంతమాత్రమూ మంచిది కాదని, ఈ విషయంలో మేము ఉపేక్షించబోము అని పేర్కొన్నారు.
ఆ చెత్త వీడియోని తీసుకొని టీడీపీ మీదకు నెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌పై పోలీసులు ఓ కంట కనిపెట్టాలని సూచనలు ఇచ్చారు. కాగా ఆ వీడియో ఒక పాతదని తెలుస్తోంది. చంద్రగిరి మండలంలో ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీకి సంబంధించిన వీడియో ఫుటేజ్ అది. దానిని పట్టుకొని టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ వైసీపీ షేర్ చేసిన వీడియో ఒక ఫేక్ వీడియో అని సమాచారం. అయితే ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవంటూ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: