అరణ్మనై4: ఓటిటికి వస్తున్నా థియేటర్ రన్ ఆగట్లేదుగా?

Purushottham Vinay
తమిళ సీనియర్ స్టార్ హీరోయిన్ కుష్బు భర్త సీనియర్ నటుడు ఇంకా డైరెక్టర్ అయిన సుందర్ సి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'అరణ్మనై 4'. 'అరణ్మనై' ప్రాంచైజీలో భాగంగా ఆయన ఇప్పటికే మూడు హారర్, థ్రిల్లర్ చిత్రాలు తీసి కోలీవుడ్ లో మంచి విజయాలను అందుకున్నారు.తాజాగా వచ్చిన 'అరణ్మనై 4' కూడా ఊహించని విధంగా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ లో అందాల తారలు తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో అచ్చో పాట బాగా ట్రెండ్ అయ్యింది. ఈ పాటలో తమన్నా, రాశి ఖన్నా హాట్ అందాలు, హాట్ స్టెప్స్ యూత్ ని ఎంతో ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాకి హైప్ పెరిగింది. అసలు ఈ పాట కోసమే థియేటర్ కి ఎక్కువ మంది యూత్ వెళ్లారు.మే 3న విడుదలైన ఈ సినిమా గత మూడు చిత్రాలను మించి మంచి సక్సెస్ అందుకుంది.


తమిళంలో 2024 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన 10 రోజుల్లోనే ఏకంగా రూ. 50 కోట్లు వసూళు చేసిన ఈ సినిమా.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అదుర్స్ అనిపించింది. ఈ సినిమా తెలుగులో ‘బాక్’ పేరుతో విడుదల అయ్యింది.తమిళ రొట్ట వాసన ఎక్కువ తగలడంతో తెలుగులో అడ్రెస్ లేకుండా పోయింది ఈ సినిమా.ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఈ ఏడాది ఏకంగా రూ.100 కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'అరణ్మనై 4' సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేసుకుంది. జూన్ 21 నుంచి హాట్ స్టార్ లో ప్రీమియర్ గా ఈ సినిమా ప్రదర్శించబడనుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో కూడా విడుదల కానున్నట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది. అయితే ఈ సినిమా థియేటర్ రన్ ఇప్పటికి కూడా బాగా కొనసాగుతుంది. అందువల్ల ఈ సినిమా ఓటిటి రిలీజ్ ని మేకర్స్ వాయిదా వెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి నిజంగా వాయిదా వేస్తారో లేదా ఓటిటి స్ట్రీమింగ్ చేస్తారో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: