చిరంజీవి గారు నన్ను ఆ రీమిక్ సినిమాకి డైరెక్షన్ చేయమన్నారు... బాబీ..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బాబీ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు కథ రచయితగా పని చేశాడు. అలా కథ రచయితగా పని చేసిన సమయంలోనే ఈయనకు మాస్ మహారాజా రవితేజ తో స్నేహం ఏర్పడింది. అలా స్నేహం వల్ల ఒక రోజు బాబి , రవితేజ కు ఒక కథను వినిపించాడు. ఆ కథ బాగా నచ్చడంతో ఆయన వెంటనే ఇతనితో సినిమా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ సినిమానే పవర్. ఆ మూవీ మంచి విజయం సాధించడంతో దర్శకుడుగా బాబీ కి సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ నీ కొనసాగిస్తున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్టేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజన్ అందుకుంది. తాజాగా బాబీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమా అవకాశం ఎలా వచ్చింది..? అసలు ఏం జరిగింది అనే వివరాలను వివరించాడు.

అందులో భాగంగా బాబీ మాట్లాడుతూ ... ఒక రోజు చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నేను వెళ్లాను. వారు మలయాళం లో లూసిఫర్ అనే ఒక మూవీ వచ్చింది , అది చూడండి , మీకు కనుక ఆ సినిమా నచ్చితే , నేను హీరో , మీరు డైరెక్టర్ అని చెప్పారు. దానితో నేను నా కథలతో మాత్రమే కంఫర్ట్ గా సినిమా చేయగలను సర్ అని చెప్పాను. దానితో నువ్వు ఒక కథ చెప్పు నాకు వింటాను అన్నారు.  20 రోజుల్లో చెబుతాను సార్ అన్నాను. 20 రోజులు అయింది. నాకు టెన్షన్. చిరు ఫోన్ చేసి కథ రెడీనా అని అడిగారు. వెళ్లి చెప్పాను , అది ఓకే అయింది. అదే వాల్తేరు వీరయ్య అని బాబి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: