కల్కి వసూళ్లు: 3000 కోట్లు పక్కా?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ "కల్కి 2898 ఏడి". ప్రమోషన్స్ తోనే ఈ సినిమా బాహుబలిని మించే రేంజ్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్ ఇప్పటికే పొలిటికల్ మ్యాటర్ తో మూవీ పై ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు. ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటన్నిటికీ సమాధానం కావాలంటే జూన్ 10 వ తేదీన విడుదల కాబోతున్న ట్రైలర్ చూడాల్సిందే. మాక్సిమం ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని ఇంకా కమల్ హాసన్ వంటి  నటీనటులతో పాటు సీనియర్ నటి శోభన, హాట్ బ్యూటీ మృనాల్ టాకూర్, దుల్కర్ సల్మాన్ లు కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా టీడీపీ గవర్నమెంట్ రాకతో ఈ సినిమా టికెట్ రేట్లు, ఈవెంట్ లు కూడా పెంచనున్నారు. బెనిఫిట్స్ షోస్ కూడా రికార్డు టికెట్స్ ధరలతో వెయ్యనున్నారు.


దీంతో ఈ సినిమా బాహుబలి రికార్డులనే కాదు దంగల్ రికార్డులని సైతం బద్ధలు కొట్టి హాలీవుడ్ రేంజ్ సినిమాలా వసూళ్లు రాబట్టొచ్చు. సినిమా స్టోరీ బాగుండి ఆడియన్స్ కి బాగా నచ్చి అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా దాదాపు 3000 కోట్ల దాకా రాబట్టొచ్చు. ఆ రేంజ్ లోనే నాగ్ అశ్విన్ ఈ సినిమాని జాగ్రత్తగా చెక్కుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.పైగా మూవీ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కూడా అంచనాలను మరింత పెంచేస్తుంది. ఇప్పటికే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ వెబ్ సీరీస్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక విడుదలైన టీజర్లు కూడా అదిరిపోయాయి. ఇక సాంగ్స్ తో కూడా మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన పని ఉంది. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సాంగ్స్ మాత్రమే కాకుండా వాటి మేకింగ్ కొరియోగ్రఫీ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అండర్‌వాటర్ లో ఇప్పటివరకు థ్రిల్లింగ్ సీన్స్ యాక్షన్ సీన్స్ చూసి ఉంటారు. దర్శకుడు నాగ్ అశ్విన్ సూపర్ ప్లాన్ తో సాంగ్ ను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది.త్వరలోనే ఆ రొమాంటిక్ సాంగ్ విడుదలకు రెడీ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: