వీడియో పెట్టు.. ఆఫర్ పట్టు.. అంటున్న అర్జీవి..!!

murali krishna
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఎంతో మంది కల. సినీ రంగుల ప్రపంచంలో నటీనటులుగా, దర్శకులుగా, మ్యూజిక్ డైరెక్టర్లుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటారు.ఎన్నో కష్టాలు, అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని తమ గమ్యాన్ని చేరాలనుకుంటారు. కానీ అందరికీ సాధమైన పని కాదు. అలాంటి వారికి ఇప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆర్జీవీ డెన్ నుంచి కొద్ది రోజుల క్రితం ఓ ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునేవారి కోసమే ఆ ప్రకటన. డైరెక్టర్స్, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ తన పోస్ట్ ద్వారా అసలు విషయం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆర్జీవీ ప్రకటనకు భారీ రెస్పాన్స్ వచ్చిందట.
ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టి్ట్యూట్ లు అన్నీ ఔట్ డేటెడ్ గా మారాయని అన్నారు వర్మ. డైరెక్టర్, రైటర్, మ్యూజిక్ కంపోజర్ ఇలా ఎందులో ఆసక్తి ఉన్నా సరే తమ డెన్ ఆహ్వానం పలుకుతుందన్నారు. అందుకు కావాల్సిన ప్రశ్నలకు తన వెబ్ సైట్ లో ఉంచాడు. ఇప్పటివరకు కొంతమంది సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 319 మంది డైరెక్టర్స్, 50 మంది మ్యూజిక్ కంపోజర్స్ తమ వెబ్ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు.అయితే వీరిలో ఒక్కో విభాగం నుంచి 10 మందిని సెలక్ట్ చేయనున్నట్లు తెలిపారు. వీరికి సంబంధించిన లిస్ట్ ను జూన్ 9న రిలీజ్ చేస్తామని అన్నారు.
డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే కాదు.. నటీనటులకు కూడా ఛాన్స్ ఉందన్నారు. ఇందుకు వారి ఫోటోస్ మాత్రమే పంపమని చెబుతూ పొరపాటు చేశామని అన్నారు. వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయని.. ఫోటోలుక్స్ వల్ల సెలక్ట్ చేయడం కాస్త కష్టంగా మారిందని అన్నారు. కాబట్టి డైలాగ్ ఆడిషన్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. డైలాగ్ వీడియో రూపంలో క్రియేట్ చేసి జూన్ 20లోపు అప్లోడ్ చేయాలని అన్నారు. అలాగే కెమెరామెన్స్ గా రాణించాలనుకునేవారు కూడా జూన్ 20 లోపు అప్లై చేసుకోవాలని అన్నారు. గతంలో ఇచ్చిన నిబంధనలను మార్పులు చేసి మరోసారి 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: