ఆ 10 లక్షల ఓట్లు జగన్ వైపేనా.. యూత్ అంతా వైసీపీకే పట్టం కట్టబోతున్నారా?
జగన్ పాలనలో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం వాలంటీర్ల ఉద్యోగాల ద్వారా ఆ ఉద్యోగాలు అంటే ఇష్టం ఉన్నవాళ్లకు పార్ట్ టైమ్ ఉద్యోగంతోనే వేతనం కల్పించడంతో ఆ ఓట్లన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల వైజాగ్ లో వేగంగా అభివృద్ధి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.
ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సునామీ వైసీపీకి అనుకూలంగా ఉందని ప్రచారం జరిగింది. ఉద్యోగుల అండ జగన్ కే ఉన్న నేపథ్యంలో యూత్ సైతం వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. జగన్ ఏపీ ప్రజలకు చేసిన మంచి ఓట్ల రూపంలో ఆయనను గెలించబోతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తోంది. గత కొన్ని నెలల్లో జగన్ ఏపీలో పరిస్థితులను పూర్తిగా మార్చేశాడని తెలుస్తోంది.
కరోనా రెండేళ్ల పాటు జగన్ పాలన సాగించిన తీరు, ఆర్థిక కష్టాలను అధిగమించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. 130 నుంచి 140 స్థానాల్లో జగన్ సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది. కూటమి మోసపూరిత హామీలను సైతం ఏపీ ఓటర్లు నమ్మే పరిస్థితులు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నిరోజుల్లో జగన్ పరిస్థితులను పూర్తిస్థాయిలో మార్చేశారని చెప్పాలి. చంద్రబాబు, పవన్ మైండ్ బ్లాంక్ అయ్యేలా జగన్ గత ఐదు సంవత్సరాల పాలన ఉంది.