ప్రపంచంలో ధనిక దేవాలయం ఎక్కడుందో తెలుసా...?
కేరళలో ఉన్న పద్మనాభస్వామి దేవాలయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో ఆ హరినారాయణుడు శేషపాన్పుపై పవళిస్తున్న రూపాన్ని మనం చూడొచ్చు. ఈ ఆలయానికి ప్రపంచంలోని ధనిక ఆలయం అనే పేరు ఉంది. ఆ ఆలయంలోపల మొత్తం ఆరు రహస్య గదులున్నాయి. ఆ గదులన్నింటిలో మీరు ఊహించలేని మోతాదులో వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయని చరిత్రకారులు కనుగొన్నట్లు కథ ఉంది. ఇందులో ఉన్న చివరి గది తలుపు మాత్రం తెరవలేదు అంట. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నుండి బంగారు బయటపడడంతో ప్రపంచమంతా దీని గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుడిలోపల కొన్ని లక్షల కోట్ల దానం ఉంటుందని అంచనా కూడా వేయడం జరిగింది. దాని తరువాత తాజాగా ౨౦౧౧ సంవత్సరంలో మళ్ళీ గుడిలో నిధులున్నట్లు గుర్తించారు.
సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం లోపల ఉన్న గదులకు ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ అనే పేర్లను పెట్టడం జరిగింది. తొలి మూడు గదులను తెరవగా.. అందులో 20 పెద్ద జగ్గులు, బంగారంతో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుని విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలను భారీ సంఖ్యలో గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తరం వైపున డి, ఆగ్నేయంలో ఎఫ్ గదులను తెరిచారు. ఈ గదుల్లో కూడా అపారమైన బంగారం, వజ్రవైడుర్యాలు భారీగా లభించాయి.
అయితే చివరి ద్వారాన్ని మాత్రం తెరవలేదు. ఆ గదికి నాగబంధనం చేసి ఉండడం వలన ఆ గదిని తెరవడం వీలు కాదని పండితులు చెబుతున్నారు. ఇది ఇప్పటికే ఒక మిస్టరీ గానే ఉండిపోయింది.