కార్తీక మాసంలో ధాన ధర్మాలు చేస్తున్నారా..అయితే ఇది తెలుసుకోండి..?

VAMSI
శివకేశవులకు అబేధం లేదని నిరూపించే మాసం ఈమహిమాన్వితమైన కార్తీక మాసం. ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అంటేనే స్నాన, దాన, జపాలు, పూజలు, దీక్షలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం వంటివి చేయడం వలన జన్మ జన్మల పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకునే మహిమాన్వితమైన మాసంగా భక్తులంతా గట్టిగా నమ్ముతారు . చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది.
“న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్”...అని స్కంద పురాణంలో చెప్పబడింది. అనగా “కార్తీక మాసానికి సమానమైన మాసము ఏదీ లేదు....శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు ...గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ ఏడాది నవంబర్ 16 సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది. సోమవారంతో కార్తీక మాసం ప్రారంభం కావడం వలన భక్తులు అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తున్నారు.
అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో హిందువులు ఈ పూజలను ఆచరిస్తారు. ఈ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉంటారు. శాఖాహార భోజనాలకే ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మాసంలో భక్తులంతా ఎక్కువగా ధన ధర్మాలు చేస్తుంటారు. దీని ద్వారా వారి మానవత్వం చాటుకుంటారు. ఈ మాసంలో ఎక్కువ  చల్లగాలులు వీస్తాయి కాబట్టి నిరుపేదలకు, అనాధలకు వెచ్చటి స్వేట్టర్లు, దుప్పట్లు, కంబళ్ళు దానం చేస్తే శివ కేశవుల యొక్క అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. చాలామంది వారు చేసిన ధాన ధర్మాల గురించి ఎవరికీ తెలియకూడదు అనుకుంటారు. గోప్యంగా ధాన ధర్మాలు చేయడం వలన అధిక పుణ్యం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: