లోకాన్ని పాలించే ప్ర‌భువు ఏసు... అస‌లు క్రిస్మ‌స్ కండీష‌న్ ఏంటో తెలుసా...!

VUYYURU SUBHASH

లోక ర‌క్ష‌కుడు ఏసు... ఈ లోకాన్ని ర‌క్షించేందుకే ఏసు జ‌న్మించ‌బ‌డ్డాడ‌ని... ఈలోకాన్ని పాలించే ప్ర‌భువు ఏసు అని క్రైస్త్ర‌వులు బ‌లంగా న‌మ్ముతారు.   ప్ర‌ప‌చంవ్యాప్తంగా క్రైస్త‌వులు త‌మ ఆరాధ్య‌దైవం ఏసు జ‌న్మ‌దినం డిసెంబ‌ర్ 25న పుట్టిన రోజునే క్రిస్మ‌స్ పండుగ‌గా జ‌రుపుకుంటారు. ఈ తేదీకి ముందు కొద్ది రోజుల ముందు నుంచే ప్రీ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తారు. క్రైస్తవ పండుగలలో కిస్మస్ అనేది ప్రధానమైన పండుగ. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండుగను బిలియన్ల మంది ప్రజలు జరుపుకుంటారు.  

 

జీసస్ జన్మించి నేటికి రెండు వేల ఏళ్లు దాటినా కరుణామయుడుగానూ, దయామయుడుగానూ క్రెస్తవులతో ఆరాధనలను అందుకుంటున్నాడు. 2 వేల ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత జ‌నాభా ఉందో తెలుసుకోవాల‌ని భావిస్తాడు. అందుకు రాజ్యంలోని ప్ర‌జ‌లంద‌రూ త‌మ‌త‌మ స్వ‌స్థాల‌కు డిసెంబ‌ర్ 25లోగా వెళ్లి ఉండాల‌ని ఆదేశిస్తాడు. ప్ర‌జ‌లంద‌రూ అదేవిధంగాచేరుకోవ‌డం మొద‌లుపెడుతారు.

 

రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్‌కు పెళ్లి  జ‌రిపించ‌డానికి పెద్ద‌లు నిశ్చ‌యిస్తారు. ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారునికి జన్మనిస్తావు.. అంతే కాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడు’ అని తెలియజేస్తుంది. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చుతుంది. ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకో వ‌డానికి నిరాక‌రిస్తాడు.

 

అయితే ఒక రోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి ‘మేరీని నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయిందంటూనే, ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు అంటూ  తెలియ‌జేస్తుంది. దీంతో విష‌యం అర్థం చేసుకున్న జోసెఫ్ మేరీని  ప్రేమతో ఆదరిస్తాడు.  ఇక, రాజాజ్ఞ ప్రకారం జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమైన బెత్లేహామ్‌కు బ‌య‌ల్దేరి వెళ్తారు. ఉండ‌టానికి నివాసం లేక‌పోవ‌డంతో ఓ పశువుల పాకలో ఆశ్ర‌యం పొందుతారు. మేరీకి ఏసు జ‌న్మిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: