స్మరణ : తమిళ నటుడు మణివన్నన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో సుమారు 400 చిత్రాలకు పైగా నటించి, ఒక మంచి గుర్తింపు పొందిన నటుడు. ముఖ్యంగా హాస్యనటుడిగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక ఈయన 1953 జూలై 31వ తేదీన మద్రాసు లో సులూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇక విద్యాభ్యాసం తన సొంత ఊర్లో ఉన్న గవర్నమెంట్ బాలుర హై స్కూల్ లో పూర్తి చేశాడు. ఇక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో చేరి, చదువుతున్న సమయంలో అక్కడ సత్యరాజ్ తో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత రాజకీయాల్లో కూడా మద్దతుదారుడిగా నిలిచాడు డీఎంకే ,అన్నాడీఎంకే పార్టీ లకు మద్దతు ఇచ్చాడు. ఇక అంతే కాదు నక్సలైట్ ఉద్యమంలో కూడా కార్యకర్తగా పని చేశాడు. ఈయన విద్యాభ్యాసం అయిన తర్వాత వస్త్ర వ్యాపారిగా అలాగే బియ్యం వ్యాపారి గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన సెంగమలం అనే ఆవిడ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఈయన కొడుకు రఘు వన్నన్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చివరిసారిగా తన నివాసంలో 2013 జూన్ 15వ తేదీన 59 సంవత్సరాలు ఉన్నప్పుడు మరణించాడు.