కూరగాయల్లో ఆర్గానిక్ కూరగాయలు ఉన్నట్టే దీపావళికి కాల్చే పటాకుల్లో పర్యావరణానికి మేలు చేసే పటాకులు వచ్చేసాయి. ఇవి కాల్చడం ద్వారా అవి పడిన చోట మొక్కలు పెరుగుతాయి. దీంతో పచ్చదనం పెరిగి ఆక్సిజన్ శాతం గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు డీలర్లు. గ్రీన్ కాకర్స్ ఇప్పుడు జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. అవే బాణ సంచా అవే టపాకాయలు.. కానీ ఇన్నాళ్లు విషం చిమ్మినట్టు కాలుష్యం వెదజల్లవు, ఊపిరి పీల్చుకునేంతగా ఉక్కిరిబిక్కిరి చేయవు. పైగా ఇవి ఎన్ని కాలిస్తే అంతగా విత్తనాలు భూమిపై పడుతాయి. అవి మొలకెత్తగానే అక్కడ పచ్చదనం బయటకు వస్తుంది.
అదే ఎలాగన్నది ఇక్క ట్విస్ట్‌గా ఉంది. మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త రకం పటాకులు జనాన్ని ఆకట్టుకుంటున్నాయి. దీపావళి దగ్గర పడుతుండడంతో మార్కెట్‌లోకి పర్యావరణహిత టపాకాయలు వచ్చేసాయి. దీపావళి సమయంలో కాల్చే బాణాసంచా ద్వారా ఉత్పత్తి అయ్యే భారీ కాలుష్యం, శబ్దాలు వీటి ద్వారా వెలువడవు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉత్పత్తిదారులు వీటిని తయారు చేశారు. బాంబులు పటాకుల లాగా వీటి వల్ల కాలుష్యం వెలువడదు. వీటినే విత్తన టపాసులు అంటారు.
ఇవి ప్రస్తుతం కొనుగోలు దారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాలంతో పాటు టపాసుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. పండుగ రోజు బాణాసంచాను పేల్చే ఆనవాయితీని కొనసాగిస్తూనే కాలుష్య ఉద్ఘారాలను తగ్గించేలా గ్రీన్ క్రాకర్స్ ను తయారు చేశారు. రాడిష్ రాకెట్, మెంతీ బాంబు, మేరిగోల్డ్ చక్రీ, బేసిల్ బాంబు లాంటి కూరగాయలు, పండ్ల మొక్కల పేర్లతో మార్కెట్‌లోకి టపాకాయలు వచ్చాయి. అందుకే వీటిని కూడా సేఫ్ క్రాకర్స్ కూడా అంటున్నారు.
వీటిని కాల్చితే వెలుగు విరజిమ్మడంతో పాటు విత్తనాలు కూడా పడుతాయి. అవి పడిన చోటు మొక్కలు పెరుగుతాయని అంటున్నారు తయారీదారులు. ఈసారి విత్తన టపాసులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నాయి. ఈ టపాసులను కాగితాలతో, కార్డు బోర్డులతో తయారు చేస్తారు ఇవి భూమిలో కలిసిపోతాయి. పర్యవరణ హితం కావడంతో వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుందంటున్నారు తయారీదారులు.