టీడీపీ.. జగన్‌ ఉచ్చులో పడితే అంతే సంగతులు?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత జైలు కు వెళ్లి 17 రోజులు దాటింది. పార్టీ యంత్రాంగం మొత్తం బాబు విడుదల కోసం ఆందోళనల్లో నిమగ్నమైంది. నారా లోకేశ్ తో పాటు మరికొందరు మాజీ మంత్రులను కూడా అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు టీంలో భయం మొదలైందనే వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు విడుదల కోసం ఇప్పటివరకు టీడీపీ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేశారు.

చంద్రబాబు విడుదల కాగానే మళ్లీ యథావిధిగా పార్టీ కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు అని తెలుగు తమ్ముళ్లు భావించారు.  అయితే చంద్రబాబును కస్టడీకి ఇవ్వడం.. క్వాష్ పిటిషన్ రద్దు చేయడం తో వారు నిరాశలో కూరుకుపోయారు.  ఈ పరిస్థితుల్లో గొడవలు పడితే ఉదాహరణకు అంగళ్లు కేసులో పార్టీ నాయకులు జైలుకు వెళ్లారు బెయిల్ వచ్చింది. తర్వాత ఆందోళన చేస్తే మరో కేసు పెడతారు. ఇలా ఎన్నికల నాటికి బైండోవర్ చేసే వ్యూహంలో వైసీసీ ఉన్నట్లు కనిపిస్తోంది.

గతంలో వైసీపీ ని అలా చేస్తారని భావించే జగన్ ఆ పార్టీ నాయకులను గొడవలకు వెళ్లొద్దని సూచించారు. పసుపు నీళ్లు చల్లినా.. పాదయాత్రకు అడ్డుపడినా ఘర్షణలకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఇప్పుడు టీడీపీ శ్రేణులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పలు కేసుల్లో ఉన్న నేతలు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి అరెస్టు చేస్తే రౌడీషీట్లు తెరిచి పాత కేసులు తిరగతోడి బైండోవర్ చేస్తారు.

ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టీడీపీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటారు.  కాబట్టి వీరంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కార్యకర్త ముందు తనకు తాను రక్షించుకొని తర్వాత పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: