హెరాల్డ్ సెటైర్:అలా సాగర్ ఎన్నికలు అవ్వగానే... ఇలా జీవో, తగ్గేదేలే...?
తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ గనుక అడుగు పెడితే మాత్రం సీఎం కేసీఆర్ కచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉండవచ్చుననే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పరిస్థితులు కాస్త ఆందోళనకు దారి తీస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకపోతే మాత్రం పార్టీలో కొంతమంది నేతలు దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
అందుకే సీఎం కేసీఆర్ తన పార్టీని కాపాడుకోవడానికి రంగంలోకి దిగారని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో అడుగుపెట్టకుండా ఉండేందుకు గాను ఆయన ఇప్పుడు సిబిఐ సాధారణ సమ్మతిని రద్దు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. సిబిఐ అడుగు పెడితే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇప్పటికే కొన్ని కేసుల్లో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులకు కోర్ట్ ఎవరికి ఏ శిక్ష విధిస్తుంది అనే ఆందోళన ఉంది. కాబట్టి సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సిబిఐ ని రాకుండా చేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.