హెరాల్జ్ సెటైర్ : జగన్, చంద్రబాబు మధ్య తేడా ఏమిటో ఇక్కడే తెలిసింది

Vijaya
పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు మధ్య తేడా ఏమిటో స్పష్టంగా మరోసారి తెలిసింది.  నెల్లూరు టూరిజం శాఖలో ఓ మహిళా కాంట్రాక్టు ఉద్యోగి  ఉషారాణిపై డిప్యుటి మేనేజర్ భాస్కరరావు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ సమస్య నేపధ్యంలో మాస్కు పెట్టుకోలేదని చెప్పినందుకే భాస్కర్ విచక్షణా రహితంగా ఉషారాణిపై దాడి చేశాడు. దాంతో కాంట్రాక్టు ఉద్యోగి ఫిర్యాదు ఇవ్వగానే డిప్యుటి మేనేజర్ ను సస్పెండ్ చేయటం, పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కూడా మొదలుపెట్టేశారు. 

సీన్ కట్ చేస్తే 2015లో కృష్ణాజిల్లాలోని ముసునూరు గ్రామంలో  ఇసుక అక్రమ తవ్వకాల వివాదంలో  అప్పటి ఎంఆర్వో వనజాక్షి అడ్డుకున్నది. దాంతో విషయం తెలియగానే నేరుగా స్పాట్ కు చేరుకున్న అప్పటి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఎంఆర్వో పై దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. అందరి ముందు వనజాక్షి జుట్టు పట్టుకుని ఇసుకలోనే ఈడ్చికొట్టాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రంలో ఎంత సంచలనమైందో కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు.

అందరి ముందు ఎంఆర్వోపై దాడి చేసి కొట్టిన ఎంఆర్వోపై అప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో అందరికీ తెలిసిందే. జరిగిన దాడిలో అసలు ఎంఎల్ఏది తప్పే లేదని చంద్రబాబు ప్రభుత్వం తేల్చేసింది. ఎంఆర్వోనే ఓవర్ యాక్షన్ చేసిందంటూ చంద్రబాబు మండిపడ్డాడు. ఎంఎల్ఏ, ఎంఆర్వోలను తన ఇంటికి పిలిపించుకుని స్వయంగా మద్యస్ధం చేశాడు చంద్రబాబు. ఎంఎల్ఏ మీద ఎట్టి పరిస్ధితుల్లోను ఎంఆర్వో కేసు పెట్టేందుకు లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. సరే తర్వాత ఎంఎల్ఏని ఆదర్శంగా తీసుకుని అప్పటి ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంపి కేశినేని నాని, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అధికారులపై ఎంతగా రెచ్చిపోయారో అందరూ చూసిందే.

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే అప్పుడూ దాడికి గురిం మహిళా అధికారే. ఇపుడూ దాడికి గురైంది కాంట్రాక్టు మహిళా ఉద్యోగే. కానీ దాడి చేసిన వాళ్ళ విషయంలో ప్రభుత్వం యాక్షన్ తీసుకున్న విధానంలోనే తేడా ఏమిటో తెలిసిపోతోంది. అప్పటి ఎంఎల్ఏకి స్వయంగా చంద్రబాబు క్లాన్ చిట్ ఇచ్చేశాడు. ఇపుడు డిప్యుటి మేనేజర్ ను ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేయటమే కాకుండా పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్టు కూడా చేశారు. టూరిజం శాఖలో జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం ఎంత స్పీడుగా స్పందించి బాధితురాలికి న్యాయం చేసిందనే విషయమే జనాల్లో చర్చ జరుగుతోంది. 


ఈ ఘటనే కాదు చంద్రబాబు హయంలో అధికారపార్టీ నేతలపై అప్పట్లో పోలీసులు ఎక్కడా ఒక్క కేసు కూడా పెట్టలేదు. బాధితులను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత  అధికారపార్టీ నేతలైనా సరే తప్పుచేస్తే కేసులు పెట్టేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటమరెడ్డి శ్రీధరెడ్డిని అరెస్టు చేశారు. తుని ఎంఎల్ఏ దాడిశెట్టిరాజా పైన కేసు పెట్టారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనేందుకు పై కేసులే నిదర్శనాలు. ఇక్కడే  జగన్, చంద్రబాబు పాలనలోని తేడాను జనాలు జాగ్రత్తగా గమనిస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: