చూస్తుంటే వ్యవహారం అలాగే ఉంది. ఏ విషయంలో అయినా ఒకటి రెండు రోజులు బాగా హడావుడి చేయటం, పచ్చమీడియా తో నానా యాగీ చేయించటం తర్వాత చప్పుడు చేయకుండా ఇష్యూని వదిలేయటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి బాగా అలవాటే. ఇపుడు మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారాన్ని కూడా చంద్రబాబు వదిలేసినట్లే ఉన్నాడు. నిమ్మగడ్డను తొలగిస్తు ప్రభుత్వం నిర్ణయించగానే నానా హడావుడి చేశాడు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాయటం, తన మద్దతుదారులతో కూడా రాయించాడు. ప్రభుత్వం జస్టిస్ కనగరాజును కొత్త కమీషనర్ గా నియమించగానే విషయాన్ని వదిలేశాడు.
విషయం ఏదైనా సరే చంద్రబాబుకు కావాల్సింది కేవలం ప్రచారం మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. సొంత ప్రచారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడు. గతంలో శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ విషయంలో ఏమి చేశాడో అందరూ చూసిందే. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తన మద్దతుదారుడన్న ఏకైక కారణంతో శాసనమండలిలో షరీఫ్ ను అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటింప చేసుకున్నాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రకటన చేసేముందు స్వయంగా షరీఫే తాను తప్పు చేసినట్లు అంగీకరించటం. తాను తప్పు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత బిల్లులను సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటించాడు. దాంతో ఛైర్మన్ ప్రకటనపై ఎంత గోల జరిగిందో అందరికీ తెలిసిందే. ఇదంతా షరీఫ్ వెనకుండి చంద్రబాబే చేయించినట్లు అందరికీ అర్ధమైంది. ఎప్పుడైతే విషయం బయటపడిందో చివరకు శాసనమండలి రద్దుకు ప్రభుత్వం సిఫారసు చేసేదాక వెళ్ళింది వ్యవహారం. కరోనా వైరస్ సమస్య లేకపోతే ఈపాటికి మండలి రద్దయిపోయేదే.
ఇపుడు నిమ్మగడ్డ విషయంలో కూడా ఇదే జరిగింది. నిమ్మగడ్డ ను వెనకనుండి చంద్రబాబే నడిపించాడని స్వయంగా జగన్మోహన్ రెడ్డితో పాటు చాలామంది వైసిపి ప్రముఖులు నేరుగానే ఆరోపించారు. వివాదం మొత్తం చిలికి చిలికి గాలివాన లాగ తయారై చివరకు నిమ్మగడ్డను తీసేసేదాక వెళ్ళింది. నిమ్మగడ్డను తీసేసి ఆ స్ధానంలో రిటైర్డ్ జస్టిస్ కనగరాజును ప్రభుత్వం నియమించిన విషయం అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ కమీషన్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ చంద్రబాబు చప్పుడు చేయటం లేదు.
పై రెండు ఘటనల్లోను అర్ధమైందేమంటే చంద్రబాబును నమ్ముకుంటే ఎవరికైనా ఉద్యోగాలు పోవటం ఖాయమని. అది పార్టీలో కావచ్చు లేదా ప్రభుత్వంలో కూడా కావచ్చు. అంటే ఎలాంటి వారినైనా తన స్వార్ధానికి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబు నెంబర్ వన్ అన్న విషయం మరోసారి రుజువైంది. ఎవరైనా తెలీక చంద్రబాబు మాయలో పడ్డారంటే అంతే సంగతులు.
మరింత సమాచారం తెలుసుకోండి: