గేమ్ ఛేంజర్: ఎన్ని కోట్లు వస్తే సినిమా హిట్టు...లెక్కలు ఇవే ?

Veldandi Saikiran
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ చిత్రం గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ విపరీతంగా వైరల్ అవుతుంది. కాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రికి సమీపంలో వేమగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా రావడం విశేషం. గోదావరి జిల్లాలో ఈ వేడుక నిర్వహించారు. పవన్ కళ్యాణ్ రావడంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈవెంట్లో హాజరయ్యారు.

ఈవెంట్ విజయవంతంగా పూర్తయింది. ఇందులో పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలను మాట్లాడారు. కాగా, గేమ్ ఛేంజర్ తెలుగు వెర్షన్ కు బ్రేక్ ఈవెన్ మార్క్ రావాలంటే రూ. 130 కోట్లు షేర్ రావాలి. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 450 కోట్లు గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. బాహుబలి, సలార్, బాహుబలి-2, కల్కి 2898ఏడి, ఆర్ఆర్ఆర్, పుష్ప-2 సినిమాలు ఈజీగా 450 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

దాంతో కచ్చితంగా గేమ్ ఛేంజర్ సైతం ఈ క్లబ్ లో మొదటి వారంలోనే చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల కన్నా ఎక్కువగా వసూలు చేస్తే ఆ రాబడి దిల్ రాజును లాభాల్లోకి తీసుకు వెళ్తోంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు దాదాపు రూ. 550 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: