సంక్రాంతి బరిలో బాలయ్య బ్లాక్‌బస్టర్ కొట్టిన సినిమాలు ఇవే..!
నందమూరి నటసింహం బాలకృష్ణకి మొదటి నుంచి కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సాధ్యమైనంత వరకూ తన సినిమా సంక్రాంతి బరిలో ఉండేలా బాలయ్య ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలా సంక్రాంతి బరి లో నిలిచిన సినిమా లతో ఆయన తిరుగులేని హిట్లు కొట్టారు. సంక్రాంతి సినిమా లతో బాలయ్య ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. అందుకే సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలు ఆయన కెరీర్ లో చెప్పుకో దగ్గ సినిమాలుగా రికార్డులకు ఎక్కాయి.
సంక్రాంతి బరిలో నిలిచిన సమయాలలో ఎక్కువసార్లు ఆయనను విజయాలు వరించాయి. అలాగే బాలయ్య సంక్రాంతి సినిమాలు వసూళ్ల విషయంలో సరి కొత్త రికార్డులను నమోదు చేశాయి. సంక్రాంతి బరిలోకి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా గా 'సమరసింహారెడ్డి ఉంటుంది. 1999 జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రెండేళ్ల కు సంక్రాంతికి ఇదే కాంబినేషన్ లో వచ్చిన నరసింహా నాయుడు కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. 2001 జనవరి 11న విడుదలైన ఈ సినిమాకి కూడా మణిశర్మనే సంగీత దర్శకుడు.
ఇక బాలకృష్ణ కెరియర్లో 100వ సినిమా మైలురాయి గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. బాలయ్య సంక్రాంతి విజయాలలో 100 సినిమా కూడా నిలవడం మరో విశేషం. 2023లో జనవరి 12న వచ్చిన వీరసింహారెడ్డి కూడా సంక్రాంతి సంచలనంగా హిట్ అయ్యింది. ఇక 2018 లో వచ్చిన జై సింహా కూడా హిట్టే. ఇక మళ్లీ ఇప్పుడు ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏం చేస్తుందో ? చూడాలి.