ఇండియాలో మొట్టమొదట విడాకులు తీసుకున్న మహిళ ఎవరో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో ఇండియాలో ఎక్కువగా విడాకుల కేసులు కూడా నమోదు అవుతూ ఉన్నాయి. గతంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విడాకుల వరకు వ్యవహారం వెళ్ళేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. మరి కొంతమంది వివాహమై 10 ,20 సంవత్సరాలు పెళ్లిళ్లు అయినా కూడా విడాకులు బాట పడుతున్నారు. అయితే ఇండియాలో మొట్టమొదట విడాకులు తీసుకున్నది ఎవరు? వారి గురించి ఏంటనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.

ఇండియాలో మొట్టమొదట విడాకులు తీసుకున్నది రుఖ్మాబాయి రౌత్.. ఈమె ఇండియాలో మొట్టమొదటి విడాకులు తీసుకున్న మహిళల నట. 1864లో ఈమె జన్మించింది ఎక్కువగా అప్పట్లో బాల్యవివాహాలు ఉండడం చేత ఈమెకు 11 ఏళ్ళ వయసులోనే 19 ఏళ్ళు ఉన్న దాదాజీ బికాజితో వివాహం అయ్యిందట. ఆ వయసులో రుఖ్మాబాయి చదువుకోరావాలని కోరిక ఉండడంతో విడాకులు తీసుకున్నట. అందుకోసం ఈ మహిళ తన వివాహ బంధాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఈమె పైన చాలానే విమర్శలు కూడా వినిపించాలని కానీ ఆ మహిళా మాత్రం వెనకడుగు వేయకుండా సమాజంతో దీటుగా పోరాడిందట.

ఈమె విడాకుల వ్యవహారం కోసం అప్పట్లో బ్రిటిష్ క్వీన్ విక్టోరియా కూడా జోక్యం చేసుకొని ఈమెకు విడాకులు అయ్యేలా చేసిందట..రుఖ్మాబాయి 1985లో అధికారికంగా విడాకులు తీసుకున్నదట. ఆ తర్వాత తాను చదువుకోవాలనుకున్న మార్గం వైపు అడుగులు వేయడమే కాకుండా ఈమె చదువు కోసం ఇతర దేశాలకు కూడా వెళ్లిందట. అలా లండన్ వైపుగా వెళ్లి అక్కడ వైద్య, విద్య కోర్సులను పూర్తి చేసిందట. అలా భారతదేశానికి మొట్టమొదట వైద్యురాలుగా తిరిగి వచ్చిందట రుఖ్మాబాయి రౌత్.. ఆ తర్వాత ఎంతోమంది దేశవ్యాప్తంగా ఈమె ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచిందట.. 30 ఏళ్లకు పైగా ఈమె రాజ్ కోటలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా కూడా పనిచేసినట. ఇవే కాకుండా ఎన్నో మంచి పనులను సాధించిందట రుఖ్మాబాయి రౌత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: