ఐపీఎల్ పుణ్యమా అని.. టీమిండియాకు మరో ఫ్యూచర్ స్టార్ దొరికేసాడు.

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో తెలుగు క్రికెటర్లు ఎంత అద్భుతంగా సత్తా చాటుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఒడిసిపట్టి తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత సెలక్టర్ల చూపును కూడా ఆకర్షిస్తున్నారు అని చెప్పాలి. అచ్చం ఇలాగే ఒకప్పుడు ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసి సెలెక్టర్ల చూపును ఆకర్షించిన హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఇక టీమ్ ఇండియాలోకి వచ్చాడు. ఇక ఇప్పుడు తన ఆట తీరుతో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పుడు మరో హైదరాబాది ప్లేయర్ సైతం తానే టీమ్ ఇండియాకు భవిష్యత్తు ఫ్యూచర్ స్టార్ అన్న విషయాన్ని తన ఆటతీరుతో నిరూపిస్తున్నాడు. అతను ఎవరో కాదు తిలక్ వర్మ. ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ తరఫున సెలెక్ట్ అయ్యాడు అతను. ఇక అతను ఎలాంటి ప్రదర్శన  చేస్తాడు అని అందరూ ఎదురు చూసారు. ఊహించిన దానికంటే మంచి ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరిచాడు తిలక్ వర్మ. గత ఏడాది ముంబై ఇండియన్స్ లో ఉన్న సీనియర్లు అందరూ విఫలమవుతున్న వేళ ప్రతి మ్యాచ్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ మంచి పరుగులు చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు తిలక్ వర్మ.

 గత ఏడాది ఐపీఎల్ సీజన్లో  ముంబై ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది అంటే అందులో తిలక్ వర్మ పాత్ర ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (1) కామరూన్ గ్రీన్ (5 )సూర్య కుమార్ యాదవ్ (15) ఇషాన్ కిషన్ (10) పరుగులతో వికెట్ కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ 46 బంతుల్లో 86 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒంటరి పోరాటం చేశాడు అని చెప్పాలి. దీంతో అతని ఇన్నింగ్స్ చూశాక టీమిండియా కు మరో ఫ్యూచర్ స్టార్ దొరికేశాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: