ఎన్టీఆర్-30.. సినిమా కాన్సెప్ట్ మొత్తం చెప్పేసిన కొరటాల?

praveen
సాధారణంగా సినిమా స్టోరీ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఎంతో సీక్రెట్ గా ఉంచాలని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న లీక్ ఇచ్చినా కూడా ప్రేక్షకులు సినిమా స్టోరీ ఏంటి అనేది ముందుగానే ఊహించుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటివి తలనొప్పులు ఉండకూడదు అని సినిమా స్టోరీ కి సంబంధించిన ఏ చిన్న లీక్ ఇవ్వరు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఇక స్టేజి మీద మాట్లాడుతూ పొరపాటున సినిమాల్లో ఉండే కీలకమైన సీక్వెన్స్ ను చెప్పేయడం లాంటివి చేస్తూ ఉన్నారు.

 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సైతం ఇలాంటిదే చేశాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా కోసం వేయికళ్లతో  ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం.  ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తారక్, జాన్వి పై చిత్రీకరణ ముహూర్తపు షాట్ కి జక్కన్న క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొరటాల శివ మూవీ లోని కీలక సీక్వెన్స్ గురించి మొత్తం రివిల్  చేసేసాడు.

 ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న  సినిమా బ్యాక్ డ్రాప్ చెప్పేసారు. జనతా గ్యారేజ్ తర్వాత నా సోదరుడు ఈ జనరేషన్లో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైనా ఎన్టీఆర్ తో కలిసి మళ్ళీ వర్క్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా విస్మరణకు గురైన ఒక తీర ప్రాంత బ్యాక్ డ్రాప్ లో దీని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషులకంటే ఎక్కువగా మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ వాళ్ళకి ఒకే ఒఒక్కటి భయం. ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్ డ్రాప్. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి పాత్ర ఇది. ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఒక ఎమోషనల్ రైడ్. నా కెరియర్ లో ఇది బెస్ట్ సినిమా అవుతుందని అందరికీ మాటిస్తున్న అంటూ కొరటాల చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: